BECIL Recruitment 2021: డేటా ఎంట్రీ ఆపరేటర్(Data Entry Operator)తో సహా అనేక పోస్టుల భర్తీకి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్(Recruitment) ద్వారా మొత్తం 103 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ becil.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
BECIL నోటిఫికేషన్ ప్రకారం.. అప్రెంటీస్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్వైజర్, సీనియర్ సూపర్వైజర్ పోస్టుల భర్తీ ఉంటుంది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ(Application process) ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్ 7, 2021 చివరితేదిగా నిర్ణయించారు. దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్(Notification)ను ఒక్కసారి పరిశీలించండి.
Also Read: UPSC Results 2020: సివిల్స్-2020 తుది ఫలితాలు విడుదల..సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు
ఖాళీల వివరాలు:
మొత్తం 103 పోస్టులు భర్తీ చేస్తారు. అప్రెంటీస్/లోడర్ 57 పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ 7 పోస్టులు, సూపర్వైజర్ 20 పోస్టులు, సీనియర్ సూపర్వైజర్ 9 పోస్టులు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం మీరు అధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు. BECIL నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఈ మెయిల్ ID ని కలిగి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 30 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఇది కాకుండా సీనియర్ సూపర్వైజర్(Supervisor) పోస్టుకు అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలు ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి గ్రాడ్యుయేట్ చదివి ఉండాలి.
అర్హతలు:
అప్రెంటిస్/లోడర్ – 8వ తరగతి పాస్
డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్వైజర్, సీనియర్ సూపర్వైజర్ – గ్రాడ్యుయేట్
వయస్సు
అప్రెంటిస్/లోడర్ – గరిష్టంగా 45 సంవత్సరాలు
డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్వైజర్ – 30 సంవత్సరాలు
సీనియర్ సూపర్వైజర్ – 35 సంవత్సరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook