Ayodhya Pran prathishtha: అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అత్యంత ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. జనవరి 22న అయోధ్య నూతన రామాలయంలో జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ ఇతర వివరాలను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
అయోధ్యలో జనవరి 22వ తేదీన బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇకపై ప్రతియేటా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. పదేళ్ల క్రితం జరగాల్సిన ఉత్సవం ఇప్పుడు జరుగుతోందన్నారు. జనవరి 22వ తేదీన జరిగే ఉత్సవం ఘనమైన దీపావళిలా ఉంటుందన్నారు. త్వరలో అయోధ్యలో 7 స్టార్ హోటల్ నిర్మించి..అందులో కేవలం శాకాహారం మాత్రమే అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. అయోధ్యలో హోటళ్ల ఏర్పాటుకు సంబంధించి 25కు పైగా ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఇందులో ఒకటే పూర్తి స్థాయి వెజిటేరియన్ 7 స్టార్ హోటల్ అని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఇప్పటికే అయోధ్యకు దేశం నలుమూలల్నించి రోడ్డు, విమానం, రైల్ కనెక్టవిటీ ఏర్పడిందన్నారు.
అయోధ్యలో రానున్న రోజుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరించారు. అయోధ్యలో త్వరలో గ్రీన్ కారిడార్ నిర్మాణం కానుందన్నారు. ఈసారి రామనవమికి 50 లక్షల వరకూ భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అయోధ్యకు చేరుకునే భక్తులకు ఏడాది పొడుగునా అన్ని రకాల సౌకర్యాలు అందేలా చేయాలన్నారు.
అయోధ్యలో కొత్త ఎయిర్‌పోర్ట్‌కు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 150 మందితో సీఐఎస్ఎఫ్ కమాండోలను మొహరిస్తున్నారు. కేంద్ర భద్రత, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సిఫారసు మేరకు అయోధ్య విమానాశ్రయానికి భారీ భద్రత కల్పిస్తున్నారు. అయోధ్య విమానాశ్రయం మొదటి దశలో 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. రెండవ దశలో రన్‌వే పొడవును 3,700 మీటర్లకు పొడిగించనున్నారు.
Also read: AP Fake Votes: ఏపీలో భారీగా దొంగ ఓట్లు, 5.64 లక్షల ఓట్లు తొలగింపు, అధికారులపై వేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook