అనంత్‌-రాధిక రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? ఫోటో వైరల్

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరోసారి వార్తల్లో ఎక్కారు.

Last Updated : Jul 30, 2018, 04:13 PM IST
అనంత్‌-రాధిక రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? ఫోటో వైరల్

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరోసారి వార్తల్లో ఎక్కారు. తాజాగా అనంత్ తన స్నేహితురాలు రాధికా మర్చంట్‌‌తో దిగిన ఫోటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు అనంత్‌కు-రాధికకు మధ్య రిలేషన్‌షిప్ ఉందనడానికి ఈ పిక్చర్స్ చాలు అంటున్నారు.

సోషల్‌ మీడియాలో షేర్‌ అయిన ఈ ఫోటోలో అనంత్‌, రాధికను హత్తుకొని ఉండగా.. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ నవ్వులు చిందిస్తున్న దృశ్యాలున్నాయి. అదీగాక ఇద్దరూ కూడా ఆకుపచ్చ దుస్తులను ధరించి ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ అంతా గ్రీనరీతో ఆహ్లాదకరంగా ఉంది. ఏదో హాలిడే స్పాట్‌లో ఎంజాయ్‌ చేస్తున్నట్టు కనిపించారిద్దరూ. ఒకవేళ అనంత్‌ నిజంగానే ప్రేమలో ఉన్నట్లు తెలిస్తే.. ఇంకేముంది ముఖేష్‌ అంబానీ ఇంట్లో మరో పెళ్లి బాజా మోగుతుంది. ఇప్పటికే ఇంట్లో ఇద్దరు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు.  

ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ, రోజీ బ్లూ డైమండ్స్‌ అధినేత రస్సెల్‌ మెహతా కూతురు శ్లోకా మెహతాకు వివాహం త్వరలో జరగబోతుంది. వీరి తర్వాత ముకేశ్ అంబానీ కూతరు ఇషా అంబానీకి పిరమాల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌కు వివాహం జరగనుంది. 

అంబానీ కుటుంబ సభ్యులు, రాధిక మర్చంట్‌ కుటుంబ సభ్యుల మధ్య స్నేహబంధం ఉంది. రాధిక మెర్చంట్‌.. యాంకర్‌ హెల్త్‌కేర్‌ సీఈవో, వైస్‌ చైర్మన్‌ విరైన్‌ మర్చంట్‌ కుమార్తె. ఆకాశ్‌-‍శ్లోకా, ఇషా-ఆనంద్‌ల మాదిరిగా అనంత్‌-రాధికలు కూడా స్నేహితులు. అయితే వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వస్తోన్న వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..!

Trending News