7th Pay Commission DA Hike News: కేంద్ర ఉద్యోగులకు త్వరలోనే ప్రభుత్వం నుంచి శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఈ ఏడాది రెండో డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు ప్రకటన రానుంది. మొదటి డీఏ 4 శాతం పెరగ్గా.. రెండో డీఏ 3 శాతానికే పరిమితం చేసే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం 42 శాతం డీఏ అందుతోంది. ఈ ఏడాది 38 శాతం ఉండగా.. మార్చిలో డీఏను 4 శాతం పెంచింది. దీంతో 42 శాతానికి చేరగా.. రెండో డీఏ 3 శాతం పెంచితే 45 శాతానికి చేరుతుంది. దీంతో కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపు ప్రకటన ప్రభుత్వం నుంచి ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి వర్తిస్తుంది.
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతి నెలా ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ) డేటాను విడుదల చేస్తుంది. దీని ఆధారంగా ఉద్యోగుల డీఏ ఎంత పెంచాలనేది నిర్ణయిస్తారు. అఖిల భారత రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా మాట్లాడుతూ.. డీఏ నాలుగు శాతం పెంచాలని తాము కోరుకుంటున్నామని.. అయితే అది సాధ్యం కావట్లేదని చెప్పారు. ఈ ఏడాది రెండో డీఏ 3 శాతం పెరిగి.. 45 శాతానికి చేరే అవకాశం ఉందన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం అన్ని లెక్కలు చూసుకుని డీఏ పెంపుపై ప్రతిపాదనను సిద్ధం చేస్తుందన్నారు. ఆ తరువాత ఆమోదం కోసం కేంద్ర మంత్రివర్గం ముందు ప్రతిపాదనను ఉంచుతుందని తెలిపారు.
డియర్‌నెస్ అలవెన్స్ ప్రతి సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తున్న విషయం తెలిసిందే. చివరిగా డీఏ పెంపు సవరణ మార్చి 24న జరిగింది. ఇది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. 47.58 లక్షల మంది ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరిందన్నారు. డీఏ పెంపు నిధుల కోసం రూ.12,815 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రెండో డీఏ పెంపుపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Also Read: Gaddar Passed Away: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత.. విషాదంలో తెలంగాణ లోకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook