7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు లెక్కలు ఇలా..!

7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపునకు సంబంధించి ప్రకటన ఈ నెలలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోసారి 4 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో 46 శాతానికి చేరనుంది. జీతాలు ఎంత పెరుగుతాయంటే..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2023, 07:29 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు లెక్కలు ఇలా..!

7th Pay Commission Latest Updates: జీతాల పెంపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అతి త్వరలోనే తీపి కబురు రానుంది. ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన రానుంది. ఈ నెలలోనే డీఏ పెంపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఆధారంగా 4 శాతం పెరుగుతుందని అంటున్నారు. ఈ సంవత్సరం మొదటి డీఏ కూడా నాలుగు శాతం పెరిగిన విషయం తెలిసిందే. దీంతో 38 శాతం నుంచి 42 శాతానికి చేరుకుంది. మరోసారి 4 శాతం పెరిగితే 46 శాతానికి చేరుకుంటుంది. ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. 

జీ20 సదస్సు తర్వాత జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో డీఏ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పెంపుదలకు ఆమోదం లభించవచ్చుడీఏ ప్రకటన ఎప్పుడు చేసినా.. జూలై 1వ తేదీ నుంచే వర్తించనుంది. జూలైలో ఏఐసీపీఐ సూచీ 3.3 పాయింట్లు పెరిగి 139.7 పాయింట్లకు చేరుకుంది. జూన్‌లో 136.4 వద్ద ఉన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 88 ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రాల్లోని 317 మార్కెట్ల నుంచి సేకరించిన రిటైల్ ధరల ఆధారంగా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచిక రూపొందించింది. ప్రతి నెల చివరి పనిదినం నాడు ఈ లెక్కలను విడుదల చేస్తోంది. 

జీతం ఎంత పెరగనుందంటే..? (డీఏ 46 శాతం పెరిగితే..)

==> బేసిక్ శాలరీ- నెలకు రూ.18 వేలు
==> కొత్త డియర్‌నెస్ అలవెన్స్-నెలకు రూ.8280 (46 శాతం ప్రకారం)
==> ప్రస్తుతం ఉన్న డీఏ- నెలకు రూ.7560 (42 శాతం)
==> ఎంత పెరగనుంది- రూ.8280-రూ.7560=రూ.720 (ప్రతి నెల)
==> వార్షిక జీతం పెంపు- 720X12=రూ. 8640

ప్రాథమిక వేతనం రూ.56,900 అయితే ఇలా..

==> బేసిక్ శాలరీ-నెలకు రూ.56,900
==> కొత్త డియర్‌నెస్ అలవెన్స్-రూ.26,174 (46 శాతం ప్రకారం)
==> ప్రస్తుత డీఏ- నెలకు రూ.23,898 (42 శాతం)
==> ఎంత పెరగనుంది-రూ.26,174-రూ.23,898= రూ.2276 (ప్రతి నెల)
==> మొత్తం ఎంత పెరుగుతుంది- రూ.2276X12= రూ.27312 (ఏడాదికి)

(ముఖ్య గమనిక: ఈ గణన డీఏ 46 శాతం పెరుగుతుందనే అంచనా ఆధారంగా మాత్రమే జరిగింది. ఉద్యోగుల చివరి జీతం దీనికి అనేక ఇతర అలవెన్సులు జోడించిన తర్వాత మాత్రమే ఫైనల్ శాలరీని లెక్కిస్తారు)

Also Read: Deepthi Murder Case: దీప్తి హత్య కేసులో సంచలన విషయాలు.. దారుణంగా చంపేసిన చందన  

Also Read: Mission Aditya L1: నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య L1.. ఇస్రో మరో ప్రయోగం సక్సెస్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News