Flash news : కొత్తగా మరో 5 కేసులు.. భారత్‌లో 39కి చేరిన కరోనా కేసులు

కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేరళలో కొత్తగా మరో 5 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో భారత్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 39కి చేరినట్టయింది. 

Last Updated : Mar 8, 2020, 02:21 PM IST
Flash news : కొత్తగా మరో 5 కేసులు.. భారత్‌లో 39కి చేరిన కరోనా కేసులు

తిరువనంతపురం: కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేరళలో కొత్తగా మరో 5 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. కేరళలో ఐదుగురికి కరోనా వైరస్ పాజిటివ్ అని గుర్తించినట్టుగా ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. ఆ ఐదుగురిలో ముగ్గురు ఇటలీ నుంచి వచ్చిన వారు కాగా.. మిగతా ఇద్దరూ వారి సమీప బంధువులుగా గుర్తించినట్టు కెకె శైలజ పేర్కొన్నారు. దీంతో భారత్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 39కి చేరినట్టయింది. అంతకంటే ముందుగా భారత్‌లోనే తొలిసారిగా కేరళలో మూడు కరోనావైరస్ కేసులు వెలుగుచూసినప్పటికీ... మూడు వారాల పాటు చికిత్స పొందిన అనంతరం ఆ ముగ్గురూ కరోనా కోరల్లోంచి బయటపడ్డారు. 

ఎయిర్ పోర్టులో వాళ్లు వాళ్ల ట్రావెల్ హిస్టరీని దాచిపెట్టారని.. ఫలితంగా అక్కడి అధికారులు సైతం వారిని పరీక్షించలేదని ఆరోగ్య శాఖ మంత్రి శైలజ చెప్పారు. ఈ కారణంగానే వారి నుంచి మరో ఇద్దరికి కరోనా వ్యాపించిందని అన్నారామె. కరోనా బాధితులు ఆస్పత్రిలో చేరేందుకు అంగీకరించలేదని... తామే బలవంతంగా వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందేలా ఏర్పాట్లు చేశామని శైలజ తెలిపారు. ఐదుగురు కరోనా వైరస్ బాధితుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు స్పష్టంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News