తమిళనాడులో విషాదం ...భారీ వర్షాలకు కుప్పకూలిన నాలుగు ఇళ్లు!

భారీ వర్షాలకు నాలుగు ఇళ్లు కూలిపోయిన సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. శిథిలాల కింద కొంతమంది చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 04:22 PM IST
తమిళనాడులో విషాదం ...భారీ వర్షాలకు కుప్పకూలిన నాలుగు ఇళ్లు!

4 houses collapse in Salem: తమిళనాడు(Tamilnadu)లోని సేలం జిల్లా(Salem district)లో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల(Heavy Rains)కు కరుంగల్‌పట్టి(Karungalpatti)లో నాలుగు ఇళ్లు కుప్పకూలాయి. దీంతో ఆ ఇళ్లలో నివసిస్తున్న వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు స్థానికుల సహాయంతో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిలో ఇప్పటివరకు 13మందిని వెలికితీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. మరో నలుగురు ఇంకా శిథిలాల కింద ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నారు.

తమిళనాడులోని తిరునల్వేలి, తూత్తుకుడి, మదురై, రామనాథ్‌పురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కరైకల్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Also Read: షాకింగ్: స్కూల్ బస్సు మిస్​ అయిందని.. విద్యార్థి ఆత్మహత్య!

ప్రస్తుతం కొనసాగుతున్న ఈశాన్య రుతుపవనాల(north east monsoon) సమయంలో తమిళనాడులో 61 శాతం అధిక వర్షపాతం నమోదైంది. పుదుచ్చేరిలో కూడా అధిక వర్షపాతం కురిసింది. 7,000 హెక్టార్లలో వరి పొలాలు, ఉద్యాన పంటలు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతిన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News