Gang Rape: బర్త్ డే పార్టీలో దారుణం... 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. తీవ్ర రక్తస్రావంతో బాలిక మృతి

West Bengal Gang Rape Incident: పశ్చిమ బెంగాల్‌లో దారుణం వెలుగుచూసింది. బర్త్ డే పార్టీలో ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆసుపత్రికి తరలించే లోపే బాలిక మృతి చెందింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2022, 12:40 PM IST
  • బెంగాల్‌లో వెలుగుచూసిన దారుణం
  • 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్
  • బర్త్ డే పార్టీలో బాలికపై అఘాయిత్యం
Gang Rape: బర్త్ డే పార్టీలో దారుణం... 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. తీవ్ర రక్తస్రావంతో బాలిక మృతి

West Bengal Gang Rape Incident: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో 14 ఏళ్ల ఓ బాలిక గ్యాంగ్ రేప్‌కు గురైంది. బర్త్ డే పార్టీకి వెళ్లిన బాలిక తీవ్ర రక్తస్రావంతో ఇంటికి తిరిగొచ్చింది. తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే పరిస్థితి విషమించి మృతి చెందింది. గ్యాంగ్ రేప్ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు... కొంతమంది వ్యక్తులు తమ బిడ్డ మృతదేహాన్ని బలవంతంగా తమ నుంచి తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. గత వారం జరిగిన ఈ ఘటనలో టీఎంసీ నేత కొడుకుపై ఆరోపణలు రావడంతో రాజకీయంగానూ ఇది తీవ్ర దుమారం రేపుతోంది.

బాధితురాలి తల్లిదండ్రులు వెల్లడించిన వివరాల ప్రకారం... నదియా జిల్లాలోని ఓ గ్రామంలో బాధిత బాలిక కుటుంబం నివసిస్తోంది. గత వారం ఆ బాలిక తమ ఇంటి సమీపంలోని గ్రామ పంచాయతీ సభ్యుడైన ఓ టీఎంసీ నేత ఇంట్లో బర్త్ డే పార్టీకి వెళ్లింది. పార్టీ నుంచి తీవ్ర రక్తస్రావంతో ఆ బాలిక ఇంటికి వచ్చింది. బాలికను ఆసుపత్రికి తరలించే లోపే ఆమె మృతి చెందింది. బాలికపై బర్త్ డే పార్టీలోనే గ్యాంగ్ రేప్ జరిగిందని... రేప్ కారణంగానే తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందిందని తెలిపారు.

ఆసుపత్రిలో ఇంకా డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వకుముందే కొంతమంది వ్యక్తులు తమ బిడ్డ మృతదేహాన్ని బలవంతంగా తమ నుంచి తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారని ఆరోపించారు. గ్యాంగ్ రేప్ వెనుక టీఎంసీ నేత కొడుకు, అతని స్నేహితులు ఉన్నారని ఆరోపించారు. తమకు తగిన న్యాయం చేయాలని స్థానిక పోలీసులను డిమాండ్ చేశారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు, స్థానిక బీజేపీ నేతలు ఈ ఘటనను నిరసిస్తూ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన టీఎంసీ నేత కుమారుడిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. 

Also Read: Ravichandran Ashwin: రవిచంద్రన్‌ అశ్విన్‌ షాకింగ్ నిర్ణయం.. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి!

Also Read: IRCTC Booking: IRCTC వెబ్ సైట్ ద్వారా ఒకే నెలలో ఎక్కువ టికెట్లు బుక్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News