Jallianwala Bagh Massacre: సరిగ్గా 104 ఏళ్ల కిందట జలియన్ వాలా భాగ్ లో ఈ రోజు అసలేం జరిగింది

Jallianwala Bagh Massacre: భారతదేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమైన ఘటనగా చెప్పబడే జలియన్వాలాబాగ్ ఘటన జరిగి నేటికీ 104 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 13, 2023, 12:32 PM IST
Jallianwala Bagh Massacre: సరిగ్గా 104 ఏళ్ల కిందట జలియన్ వాలా భాగ్ లో ఈ రోజు అసలేం జరిగింది

Jallianwala Bagh Massacre Explained in Telugu: భారతదేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమైన, అత్యంత బాధాకరమైన ఘటనగా జలియన్వాలాబాగ్ ఉదంతాన్ని కచ్చితంగా అందరూ నేటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ ఘటన జరిగి నేటికీ 104 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటి బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాదిమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలా ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో అనేకమంది మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారంటే విన్న తర్వాత మీ హృదయం ద్రవించక మానదు.

జలియన్వాలాబాగ్ అనేది పంజాబ్లోని అమృత్సర్ నగరంలోని ఒక పెద్ద తోట. పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాకీ పండుగ సందర్భంగా 1919 వ సంవత్సరంలో ఏప్రిల్ 13వ తేదీన పండుగ చేసుకునేందుకు ఆ తోటకు వేలాది మంది చేరుకున్నారు. అయితే ఇదే వేడుకల్లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ అనే చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాతీయోద్యమ నేతలు సైతం వారిని ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. ఇక అంతకు ముందు నుంచే ఈ రౌలత్ చట్టం మీద దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబికింది. అలాంటి వారిని అరెస్టు చేయడాన్ని జలియన్వాలాబాగ్ లో ఖండించారు.

అయితే ఈ ఉదంతం జరగడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు జనరల్ డయ్యర్ జలంధర్ నుంచి అమృత్సర్ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. అమృత్సర్ వచ్చి రావడంతోనే బహిరంగ ప్రదేశాల్లో జనం గుమి కూడటం మీద ఆంక్షలు విధించాడు. అయితే ఈ విషయం అప్పట్లో సమాచార మాధ్యమాల ద్వారా పూర్తిస్థాయిలో అందరి దృష్టికి వెళ్లలేదు. ఎప్పటిలాగే పండుగ జరుపుకుందాం అని దాదాపు 20,000 మంది సిక్కులు, హిందూ ,ముస్లిం సోదరులు కలిసి జలియన్వాలాబాగ్ లో సమావేశమయ్యారు. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సదరు చోట చుట్టూ ఎతైన ప్రహరీ గోడ అక్కడక్కడ చిన్నచిన్న ద్వారాలు మాత్రమే ఉన్నాయి.

ఇదీ చదవండి: Vetrimaran on Jr NTR: ఎన్టీఆర్ సినిమాపై వెట్రిమారన్ క్లారిటీ.. ఆ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి?

అక్కడ వేలాదిమంది గుమీకూడారన్న విషయం తెలుసుకున్న జనరల్ డయ్యర్ బ్రిటిష్ సైన్యాన్ని తీసుకుని ఈ తోటలోకి జొరబడి నిరాయుధులుగా ఉన్న జనం మీద విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. ఆయన సారధ్యంలోని 50 మంది సైనికులు 10 నిమిషాల పాటు 1650 రౌండ్లు కాల్పులు జరిపితే అప్పటి అధికారిక లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. అయితే అనధికార లెక్కల ప్రకారం అప్పట్లో వెయ్యి మంది మృతిచెందగా రెండు వేల మందికి పైగా గాయాల పాలయ్యారు.

ఇలా విచక్షణారహితంగా కాల్పులకు దిగిన సమయంలో నెత్తురు ఓడుతున్నా సరే ఆ తోట గోడల మీదకు ఎక్కి బయటికి దూకేందుకు విఫల యత్నం చేశారు కొందరు, మరికొందరు అక్కడ ఉన్న నూతిలో దూకి ప్రాణాలు కాపాడుకుందాం అనుకుని పోగొట్టుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే వారు చనిపోయిన వారిని మృతదేహాలు కూడా తరలించకుండా గాయపడిన వారికి చికిత్స కూడా అందకుండా చేసిన డయ్యర్ అనేక మంది మృతికి కారణమయ్యాడు.

అందుకే స్వాతంత్రోద్యమ చరిత్రలో ఇది ఒక విషాదకర ఘటనగా బ్లాక్ డే గా మిగిలిపోయింది. అయితే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని ఒత్తిడి మేరకు ఉద్యోగం నుంచి తొలగించి లండన్కు పంపించినా సర్ అనే బిరుదుతో సత్కరించింది బ్రిటన్ ప్రభుత్వం. అయితే ఈ ఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఉద్ధం సింగ్ అనే ఒక దేశభక్తుడు లండన్ వెళ్లి 1940 మార్చి 13వ తేదీన జనరల్ డయ్యర్ ని హతమార్చి ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నాడు.

ఇదీ చదవండి: Balagam Director Venu: మా మనోభావాలు దెబ్బతీశాడు, చర్యలు తీసుకోండి.. బలగం డైరెక్టర్‌ వేణుపై ఫిర్యాదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News