Breast Cancer: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్టేజ్‌- 3 అంటే ఏమిటి? లక్షణాలు, చికిత్సలు ఏముంటాయి..?

Breast Cancer Symptoms: స్టేజ్‌ 3 అంటే ప్రమాదకర స్థాయిలో కేన్సర్‌ దశ ఉండటం. వ్యాధికి చికిత్స కంటే ముందుగానే గుర్తిస్తే త్వరగా నయం అవుతుంది. తరచూ స్క్రీనింగ్‌, డయాగ్నోస్‌ వంటివి చేయించుకోవాలి.

Written by - Renuka Godugu | Last Updated : Jun 28, 2024, 06:32 PM IST
Breast Cancer: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్టేజ్‌- 3 అంటే ఏమిటి? లక్షణాలు, చికిత్సలు ఏముంటాయి..?

Breast Cancer Symptoms: బాలీవుడ్‌ టీవీ యాక్టర్‌ హీనా ఖాన్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, ప్రస్తుతం మూడవ దశలో ఉంది చికిత్స కూడా కొనసాగుతుందని సోషల్‌ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే, బ్రెస్ట్‌ కేన్సర్‌ అంటే ఏమిటి? దీని లక్షణాలు, చికిత్సలు ఏముంటాయో తెలుసుకుందాం.

స్టేజ్‌ 3 బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అంటే ఏమిటి?
సాధారణంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను దశలలో విభజించారు. అది ట్యూమర్‌ సైజును బట్టి దశలను నిర్ణయిస్తారు. స్టేజ్‌ 3 బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అంటే అడ్వాన్స్డ్‌ దశ. 

టైప్‌..
బ్రెస్ట్‌ క్యాన్సర్‌ మూడు సబ్‌ కేటగిరీల్లో విభజించారు, 3A ఈ క్యాటగిరీలో ట్యూమర్‌ బ్రెస్ట్‌కు వ్యాపించదు.కానీ, సెల్స్‌ 4-9 లింఫ్‌ నోడ్స్‌ కనిపిస్తాయి.

నాలుగు సెంటీ మీటర్లకంటే పెద్దగా ఉండే ట్యూమర్‌ను లింఫ్‌ నోడ్స్‌ అంటారు. పెద్ద ట్యూమర్‌  బ్రెస్ట్‌ బోన్‌కు కూడా వ్యాపించగలదు.

స్టేజ్‌ 3B..
ఈ స్టేజ్‌లో ట్యూమర్‌ బ్రెస్ట్‌ అంచులకు, చర్మానికి కూడా వ్యాపిస్తుంది. వాపు, అల్సర్‌ వంటివి సులభంగా గుర్తించవచ్చు. ఇది దాదాపు 9 లింఫుల వరకు వ్యాపిస్తుంది.

స్టేజ్‌ 3C..
ఈ దశలో పది కంటే ఎక్కవ లింఫ్‌ నోడ్స్‌ ఏర్పడతాయి. ఇది కాలర్‌ బోన్‌ కు ఎగువ లేదా దిగువ వరకు వ్యాపించవచ్చు. 

స్టేజ్‌ ౩ క్యాన్సర్‌ దశకు కారణాలు ఇవే..
ఈ స్టేజ్‌ వరకు రావడానికి జెనిటిక్‌ కాణాలు కూడా ఉండొచ్చు. అంతేకాదు వయస్సు పెరిగే కొద్దీ ప్రమాదం కూడా పెరుగుతుంది. ఫ్యామిలీ హిస్టరీ కూడా మరో కారణం, ఒబేసిటీ, ఆల్కహాల్‌ అతిగా తీసుకోవడం సరైన ఫిజికల్‌ యాక్టివిటీ లేకపోవడం కూడా ఈ కేన్సర్‌కు ప్రధాన కారణం.

లక్షణాలు..
బ్రెస్ట్‌ లేదా చంకల వద్ద గడ్డ మాదిరి ఏర్పడుతుంది.
రొమ్ము పరిమాణంలో మార్పులు
నిప్పల్‌లో బ్లీడింగ్‌

ఇదీ చదవండి:  మారుతున్న సీజన్‌లో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఈ 5 జాగ్రత్తలు తీసుకోండి..

చికిత్స..
ఫిజికల్‌ ఎగ్జామినేషన్‌ చేస్తారు..
మామోగ్రామ్‌, ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్‌ ద్వారా ట్యూమర్‌ గుర్తించడం
బయోప్సీ ద్వారా బ్రెస్ట్‌ చిన్న టిష్యూను కలెక్ట్‌ చేసి లాబోరేటరీ టెస్ట్‌ కు పంపిస్తారు

ట్యూమర్‌ తొలగించడానికి లంపెక్టమీ సర్జరీ చేస్తారు. లేదా మసెక్టమీ బ్రెస్ట్‌ను పూర్తిగా కూడా తొలగించవచ్చు. రేడియేషన్‌ థెరపీ ద్వారా కేన్సర్‌ కణాలను నాశనం చేస్తారు. కీమోథెరపీ డ్రగ్స్‌ ద్వారా కేన్సర్‌ సెల్స్‌ పెరగకుండా నాశనం చేస్తారు. హర్మోన్‌ థెరపీ కూడా ఉంటుంది. తద్వారా హర్మోన్స్‌ బ్లాక్‌ చేస్తుంది.  టార్గెటెడ్‌ థెరపీ, ఇమ్యూనోథెరపీ చికిత్స కూడా ఉంటుంది.

ఇదీ చదవండి: వారానికి ఒక్కసారైనా ఈ కూరగాయ తినండి.. మీ గుండె ఉక్కులా మారుతుంది..

స్టేజ్‌ 3 అంటే ప్రమాదకర స్థాయిలో కేన్సర్‌ దశ ఉండటం. వ్యాధికి చికిత్స కంటే ముందుగానే గుర్తిస్తే త్వరగా నయం అవుతుంది. తరచూ స్క్రీనింగ్‌, డయాగ్నోస్‌ వంటివి చేయించుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News