Heart Attack Symptoms: ఇటీవలి కాలంలో హార్ట్ ఎటాక్ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా తక్కువ వయసున్న వారిలోనూ గుండెపోటుతో మరణిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే హార్ట్ ఎటాక్ అనుకోకుండా వచ్చినా.. దానికి తాలుకూ లక్షణాలు మాత్రం ముందు నుంచే మనకు హెచ్చరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ గుండెపోటు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం..
- ఎడమ చేయి వైపు లేదా రెండు చేతుల్లో నొప్పి.. ఛాతిలో ఆందోళనకరంగా ఉన్నా, వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.
- కింది దవడ, మెడ, జీర్ణాశయం భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపించినా.. వెంటనే గుండె సంబంధిత వైద్యుడ్ని సంప్రదించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.
- శరీరంలో తీవ్రమైన అలసట వస్తుంది. ఏ పని చేసినా.. ఆయసం రావడం వల్ల గుండెపోటుకు ముందు వచ్చే లక్షణం.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించినా ఛాతి పట్టేసినట్లు ఉన్నా.. వైద్యుడ్ని సంప్రదించాలి. ఛాతిలో విపరీతమైన నొప్పి ఉంటే ఆసిడిటిగా భావించి చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం.
ఈ లక్షణాల్లో ఏవీ కనిపించినా అశ్రద్ధగా ఉండొద్దని గుండె సంబంధిత నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులను ముందస్తుగా గుర్తిస్తే తగిన చికిత్స ద్వారా వెంటనే నయం చేయవచ్చని సూచిస్తున్నారు. కాబట్టి ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలను చేయించుకోవడం ఉత్తమం అని గ్రహించాలి.
Also Read: Health tips: గుడ్డుతో పాటు ఈ ఆహారపదార్థాలు కలిపి తింటే.. ఇక అంతేనట!
Also Read: మీకు టీతో పాటు బిస్కట్ తినే అలవాటుందా..అయితే వెంటనే మానేయండి మరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook