Weight Loss Plan: బరువు పెరగడం కారణంగా చాలా మందిలో గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయి. అయితే శరీర బరువును ఎంత సులభంగా తగ్గించుకుంటే అంత మంచిది లేకపోతే ప్రాణాంతకంగా మారే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. శరీర బరువు ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా విచ్చలవిడిగా పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు తగ్గడానికి పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు తీసుకునే డైట్‌లో ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం చాలా మంది శరీర బరువును తగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువును నియంత్రించుకోలేకపోతున్నారు. మరికొందరైతే మార్కెట్‌లో రసాయనాలతో కూడిన డ్రింక్స్ తీసుకుంటున్నారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నింటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు రకాల ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడమేకాకుండా, శరీరం దృఢంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఈ ఫలితాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
శరీర బరువును నియంత్రించుకోవడానికి ఈ ఆహారాలు చాల:
పెసర పప్పు:
పెసర పప్పులో శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఈ పప్పును ఆహారంలో తీసుకుంటే శరీరంలో కొలిసిస్టోకినిన్ హార్మోన్లను పెంచి ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో మీరు సులభంగా బెల్లీ ఫ్యాట్‌తో పాటు శరీర బరువును నియంత్రించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది.
మజ్జిగ:
వేసవి కాలంలో మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో కూడా ఆకలిని నియంత్రించే చాలా రకాల యాసిడ్స్ లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు భోజనం చేసిన తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీర కూడా హైడ్రేట్‌గా ఉంటుంది.
చియా విత్తనాలు:
చియా విత్తనాలలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రోటీన్స్ లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో కరిగే ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటినికి క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రించి బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చు.
Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
IPL newsPBKS Vs RR ScorecardPBKS vs RRPBKS Vs RR Live Updates