Weight Loss Recipes At Home In Telugu: చాలామంది బరువు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే గంటల తరబడి జిమ్‌లో కష్టతరమైన వ్యాయామాలు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే మార్కెట్లో లభించే ఖరీదైన ప్రొడక్ట్స్ కూడా వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించినప్పటికీ ఫలితాలు జీరోనే.. అయితే బరువు తగ్గే క్రమంలో శరీరానికి వ్యాయామాలు ఎంత అవసరమో.. డైట్ కూడా అంతే అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజు తీసుకునే డైట్ లో భాగంగా కొన్ని రకాల సలాడ్స్ తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందగలుగుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఈ సలాడ్స్ తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని వారు అంటున్నారు. ముఖ్యంగా స్పీడ్ గా బరువు తగ్గాలనుకునేవారు రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఎగ్ సలాడ్ ను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో? కావాల్సిన పదార్థాలు ఏమిటో? ఇప్పుడు తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు:
మీకు ఇష్టమైన కూరగాయలు (ఉదా: బీట్‌రూట్, క్యారెట్, బంగాళాదుంప, బ్రోకలీ, ఫ్లవర్)
ఉప్పు
మిరియాలు
ఆలివ్ ఆయిల్
వెల్లుల్లి రేకులు
ఉడకబెట్టి కోడి గుడ్లు
వినెగర్ (బాల్సామిక్ లేదా యాపిల్ సైడర్ వినెగర్)
తులసి ఆకులు (తరిగినవి)
ఇతర ఆకులు (ఉదా: పార్స్లీ, కొత్తిమీర)
తయారీ విధానం:
కూరగాయలను ఉడికించడం: మీకు ఇష్టమైన కూరగాయలను శుభ్రం చేసి, తరిగి, ఉప్పు వేసి మృదువుగా అయ్యే వరకు ఉడికించాలి.
కూరగాయలను చల్లబరచడం: ఉడికించిన కూరగాయలను చల్లటి నీటిలో కడిగి, నీరు పిండి వేసి, ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవలసి ఉంటుంది.
డ్రెస్సింగ్ తయారు చేయడం: ఒక చిన్న బౌల్‌లో ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి రేకులు, వెనిగర్, ఉప్పు, మిరియాలు, తులసి ఆకులను కలిపి ఒక డ్రెస్సింగ్ తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాల్సి ఉంటుంది.
తయారు చేసుకున్న డ్రెస్సింగ్ ను ఉడికించిన కూరగాయలపై వేసుకొని నిమ్మకాయ పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
సర్వ్ చేయడం: తయారైన బాయిల్డ్ సలాడ్‌ను ఒక ప్లేట్‌లో వేసి, అన్ని ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అంతే ఉదయాన్నే తినండి.
చిట్కాలు:
మీరు తాజా కూరగాయలకు బదులుగా స్తీవ్ కూరగాయలను కూడా ఉపయోగించవచ్చు.
డ్రెస్సింగ్‌లో మీకు ఇష్టమైన మసాలాలు లేదా ఆకుకూరలను కూడా చేర్చుకోవచ్చు. ఈ సలాడ్ ను ఫ్రిజ్లో నిల్వ చేసుకొని కూడా రెండు రోజులపాటు తినవచ్చు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.