Steroids for Covid-19 Treatment: ఆ కోవిడ్19 బాధితులకు స్టెరాయిడ్స్‌ వాడకం చాలా ప్రమాదకరం

Usage of Steroids for Coronavirus treatment: గతంలో ఏడాదికి రెండు పర్యాయాలు షుగర్ టెస్ట్ చేయించుకున్నా ఎలాంటి డయాబెటిస్ సమస్య అతడిలో కనిపించేవి కావు. కానీ కోవిడ్19 జయించిన కొన్ని నెలలకు ఆయన మధుమేహ బాధితుడిగా మారారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 13, 2021, 04:37 PM IST
Steroids for Covid-19 Treatment: ఆ కోవిడ్19 బాధితులకు స్టెరాయిడ్స్‌ వాడకం చాలా ప్రమాదకరం

Usage of Steroids for Coronavirus treatment: కరోనా సెకండ్ వేవ్‌లో బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్లు వైద్య శాస్త్రానికి కొత్త సవాల్‌గా మారినా వైద్యులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో కొన్ని విషయాలు గుర్తించారు. నియంత్రణలో లేని మధుమేహం సమస్య ఉన్నవారికే కరోనా బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని గుర్తించారు. కానీ కరోనా బారి నుంచి కోలుకున్న కొందరు పేషెంట్లలో కొత్తగా మధుమేహం సమస్య తలెత్తుతోంది.

రియల్ ఎస్టేట్ లావాదేవిలు చేసే అనిల్ మెహతా అనే వ్యక్తికి కరోనా వైరస్ (CoronaVirus) బారిన పడిన సమయంలో ఇన్ఫెక్షన్ అధికమైంది. ఈ నేపథ్యంలో వైద్యులు అతడికి స్టెరాయిడ్స్ ఇవ్వక తప్పని పరిస్థితుల్లో వాటిని వినియోగించారు. గతంలో ఏడాదికి రెండు పర్యాయాలు షుగర్ టెస్ట్ చేయించుకున్నా ఎలాంటి డయాబెటిస్ సమస్య అతడిలో కనిపించేవి కావు. కానీ కోవిడ్19 జయించిన కొన్ని నెలలకు ఆయన మధుమేహ బాధితుడి (Steroid use causes Diabetes)గా మారారు. 80 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిని ఇన్‌ఫెక్షన్ తీవ్రతరం కావడంతో స్టెరాయిడ్స్ వాడకం ద్వారా అనంతర కాలంలో ఈ సమస్య వచ్చినట్లు గుర్తించారు.

Also Read: Corona Third Wave: చిన్నారులపై కరోనా థర్డ్‌వేవ్..ఆధారాల్లేవంటున్న నీతి ఆయోగ్

ముఖ్యంగా దేశంలో గుజరాత్ రాష్ట్రంలో ఇలాంటి కేసులు అధికంగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర మోతాదు పెరగడంతో ప్రస్తుతం రోజుకు రెండు ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తోంది. ఈ విషయాలను టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. గతంలో డయాబెటిస్, ఒబేసిటీ అండ్ మెటబాలిజం జర్నల్‌లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ అధికం కావడంతో స్టెరాయిడ్స్ వాడితే, కొంతకాలానికి డయాబెటిస్ సమస్య (COVID-19 For Diabetes Patient) తలెత్తుతుందని ప్రముఖ వైద్యులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Corona Third Wave: 5 ఏళ్లలోపు చిన్నారులకు Face Masks అక్కర్లేదు, DGHS సూచన 

కొందరు మధుమేహం బారిన పడినా టెస్టులు చేయించుకుంటేగానీ వారికి ఆ సమస్య తెలియదు. హైపర్‌టెన్షన్ లేదా బీపీ, ఆహారపు అలవాట్లు సైతం షుగర్, గుండె జబ్బులకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక ప్రతిరోజూ శారీరక శ్రమ చేయాలని, ధ్యానం లాంటివి చేయడం ద్వారా సైతం ఒత్తిడి తగ్గి కొన్ని జబ్బుల బారిన పడకుండా ఉంటారని సూచిస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News