Papaya Fruit Side Effects In Telugu: ప్రతి రోజు బొప్పాయి పండు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులోని గింజలను ఔషధ మూలికలుగా కూడా వినియోగిస్తారు. ఇందులో పోషకాలతో పాటు ఖనిజాలు కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అయితే చాలా మంది ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయని అతిగా తింటూ ఉంటారు. నిజానికి ఇలా అతిగా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
బొప్పాయి పండు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
జీర్ణ సమస్యలు:
ఖాళీ కడుపుతో బొప్పాయిని అతిగా తినడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అజీర్ణం, గ్యాస్, అతిసారం వంటి సమస్యలకు కూడా దారి తీస్తాయి. ఇవే కాకుండా ఇతర దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి.
అలర్జీ:
కొంతమందిలో బొప్పాయి పండును అతిగా తినడం వల్ల అలర్జీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు చర్మంపై దురద, ఉబ్బరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయని వారంటున్నారు.
ఔషధాలతో ప్రతిచర్య:
బొప్పాయి అతిగా తినడం వల్ల ఔషధాలు తీసుకునేవారికి అనేక సమస్యలు వస్తాయి. ఇప్పటికే ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ట్యాబ్‌లెట్స్ వినియోగిస్తే దీనిని అతిగా తినకపోవడం చాలా మంచిది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
రక్తం గడ్డకట్టడం:
బొప్పాయిలో ఉండే లాటెక్స్ అనే పదార్థం రక్తం గడ్డకట్టడం ప్రక్రియను మందగిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నవారు బొప్పాయిని తీసుకోవడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణాలు తెలుపుతున్నారు.
గర్భస్రావం ప్రమాదం:
కొన్ని అధ్యయనాల ప్రకారం.. గర్భవతిగా ఉన్న మహిళలు బొప్పాయిని అధికంగా తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి గర్భవతులు బొప్పాయిని తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
చర్మంపై ప్రభావం:
బొప్పాయి చర్మంపై కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ముఖ్యంగా సూర్యరశ్మికి ఎక్కువగా గురైనప్పుడు బొప్పాయి తినడం వల్ల చర్మం ఎర్రబడటం, దురద, ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.