Reduce Back Pain In 2 Days: ఏం చేసినా నడుము నొప్పి తగ్గడం లేదా? ఇలా 100 శాతం చెక్ పెట్టొచ్చు!

Reduce Back Pain Naturally In Just 2 Days: చాలామందిలో సర్వసాధారణ సమస్యగా మారింది. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకుండా సులభంగా ఉపశమనం పొందవచ్చు. కేవలం ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ ఇంటి చిట్కాలను వినియోగిస్తే చాలు.

Written by - Shashi Maheshwarapu | Last Updated : Apr 21, 2024, 09:06 PM IST
Reduce Back Pain In 2 Days: ఏం చేసినా నడుము నొప్పి తగ్గడం లేదా? ఇలా 100 శాతం చెక్ పెట్టొచ్చు!

 

Reduce Back Pain Naturally In Just 2 Days: ప్రతిరోజు ఒకే భంగిమలు గంటలకు కూర్చోవడం, ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం కారణంగా చాలామందిలో కీళ్ల నొప్పులతో పాటు నడుము నొప్పి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా యువతలోనైతే రోజురోజుకు ఈ సమస్య రెట్టింపు అవుతుంది. అలాగే కొంతమంది అయితే నడుము నొప్పి కారణంగా కూర్చొని లెవ్వలేకపోతున్నారు. నిజానికి ఇది పైకి చూడడానికి పెద్ద సమస్య కాకపోయినప్పటికీ లోపల మాత్రం నరకంగా అనిపిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు కొంతమంది ఈ నొప్పులను తట్టుకోలేక తరచుగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. నిజానికి పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల విపరీతమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతిరోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ ఇంటి చిట్కాలను పాటించండి చాలు..

నడుము నొప్పి ఇతరు నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు అల్లాన్ని మరిగించి, ఆ నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఎందుకంటే అల్లం లో జింజేరోన్ అని ఆరోగ్యకరమైన బయో యాక్టివ్ రసాయనాలు ఉంటాయి. కాబట్టి ఇవి సులభంగా నొప్పుల నుంచి వాపుల నుంచి తగ్గించి వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఎంతగానో సహాయపడతాయి. దీంతోపాటు ప్రతిరోజు పాలలో పసుపు కలుపుకొని తాగడం వల్ల కూడా ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

పసుపు పాలలో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని మంటను వెన్నునొప్పి నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీంతోపాటు ఆహార పదార్థాలు ఎక్కువగా వెల్లుల్లిని వినియోగించడం కూడా ఎంతో మంచిది. అలాగే నొప్పి ప్రభావిత ప్రాంతంలో లవంగాల నూనెతో మసాజ్ చేయడం వల్ల కూడా సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. దాల్చిన చెక్క సర్వరోగ ఔషధమూలికగా పనిచేస్తుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

అయితే ఇది వెన్ను నొప్పికి కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు వెన్నునొప్పి నుంచి తక్షణమే ఉపశమనం కలిగించేందుకు దోహదపడతాయి. కాబట్టి తరచుగా ఈ నొప్పులతో బాధపడేవారు దాల్చిన చెక్కతో తయారు చేసిన టీని తీసుకోండి. దీంతోపాటు రాక్ సాల్ట్ లో ఉండే గుణాలు కీళ్ల నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి ఆహారాల్లో ఎక్కువగా దీనిని వినియోగించడం ఎంతో మంచిది.

నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నిపుణులు సూచించినది. మాత్రమే కాబట్టి వీటిని వినియోగించే ముందు వైద్యుల సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ సమాచారాన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించదు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News