Ragi Atukulu For Weight Loss In 16 Days: మన పూర్వీకులు ఎక్కువగా చిరుధాన్యాలను వినియోగించేవారు. అందుకే వారంతా దృఢమైన శరీరాన్ని కలిగుండడమే కాకుండా ఆరోగ్యంగా జీవించగలిగారు. చిరుధాన్యాల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వీటితో తయారుచేసిన ఆహారాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కాకుండా ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా శరీరాన్ని సులభంగా రక్షిస్తాయి. అందుకే పూర్వీకులు వీటిని ఎక్కువగా వినియోగించే వారిట. అయితే ప్రస్తుతం చాలామంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా శరీర బరువు తగ్గాలనుకునే వారు కూడా వీటితో తయారుచేసిన ఆహారాలను డైట్ లో చేర్చుకుంటున్నారు.
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో ఊబకాయం సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు చిరుధాన్యాల్లో ఒకటైన రాగులను డైట్లో వినియోగించాల్సి ఉంటుంది. రాగులతో తయారుచేసిన అటుకులను ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ గుణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రాగి అటుకులను అల్పాహారంలో ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు
రాగి అటుకులు తయారు చేసుకునే విధానం:
అటుకులకు కావాల్సిన పదార్థాలు:
పది రాత్రంతా నానబెట్టిన బాదం పప్పులు
తగినంత పటిక బెల్లం
నానబెట్టిన చియా గింజలు
ఒక కప్పు నీరు
ఒక కప్పు రాగి అటుకులు
రాగి అటుకుల తయారీ పద్ధతి:
ఈ అటుకులు తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి.
ఈ మిక్సీ జార్ లో ఒక కప్పు నీటిని వేసి అందులోనే పట్టిక బెల్లం, జియా గింజలు, పొట్టు తీసిన బాదంపప్పు వీటన్నిటిని వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి.
ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు పక్కన పెట్టి ఓ గ్లాసులో సర్వ్ చేసుకోవాలి.
ఇలా సర్వ్ చేసుకున్న గ్లాసులో రాగి అటుకులను వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇలా రాగి అటుకులను కలిపిన తర్వాత తింటే కరకరలాడుతూ నోటికి రుచి అందించడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది.
Also read: Dark Circles: డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని పాడుచేస్తున్నాయా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook