Benefits Of Eating Radish: భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన కూరగాయ ముల్లంగి. దీనిని ఎక్కువగా సలాడ్, అచార్లు, కూరలు వంటి వాటిలో ఉపయోగిస్తుంటారు. ముల్లంగి ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది కేవలం రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముల్లంగిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఇందులో ఉండే పోషకాలు ఏంటో మనం తెలుసుకుందాం.
ముల్లంగి చాలా సులభంగా పెరిగే పంట. దీనిని భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. ముల్లంగి వార్షిక, దైవార్షిక పంట. ఇందులో విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, ఫైబర్, క్యాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ముల్లంగి తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఫైర్ ఎక్కువగా ఉంటుంది. ఇది గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే అధిక బరువుతో బాధపడేవారు కూడా ముల్లంగిని తినడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. ఇందులో కేలరీలు అతి తక్కువగా ఉంటాయి. కాబట్టి ముల్లంగితో తయారు చేసే ఆహారపదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా ముల్లంగిని తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఉండే ఫోలేట్ చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో ఎంతో మేలు చేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు దీని తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
అలాగే ముల్లంగిని తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు . ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. మచ్చలు, మొటిమలను కూడా తగ్గిస్తాయి. ముల్లంగి సలాడ్ ను తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ముల్లంగిలో ఉండే ఫైబర్ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచి ఆహారం. ఇది ఇన్సులిన్ ను అదుపు లో ఉంచడంలో సహాయపడుతుంది. కంటి సమస్యలతో బాధపడేవారు కూడా ఈ ముల్లంగిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపుకు ఎంతో సహాయపడుతుంది. ముల్లంగి మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది.
ముల్లంగిని ఎలా తీసుకోవచ్చు:
చాలా మంది ముల్లంగిని సలాడ్‌లో ఉపయోగిస్తుంటారు. దీని నేరుగా తినడానికి ఇష్టపడనివారు జ్యూస్ చేసుకొని కూడా తాగవచ్చు. అలాగే ముల్లంగితో వివిధ రకాల వంటలను వండుకోవచ్చు. కొంతమంది ముల్లంగి పచ్చడిని తయారు చేసుకొని తింటారు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది.
ముల్లంగిని ఎవరు తినకూడదు:
ముల్లంగిలో బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నప్పటికి దీని కొంతమంది తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల కడుపులో సంతృప్తి కలుగుతంది. అలాగే చలికాలంలో ముల్లంగిని ఎక్కువగా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల వాపులు కలగవచ్చని వారు సూచిస్తున్నారు. అంతేకుండా ఆరెంజ్, కీరదోస, కాకరకాయ, పాలు, పాల ఉత్పత్తులను ముల్లంగితో కలిపి తీసుకోవడం వల్ల శరీరానకి హాని కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
Also Read: Diabetes: డయాబెటిస్ కంట్రోల్లో ఉండాలంటే ఈ ఆసనాలు ట్రై చేయాల్సిందే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.