Fastest Way To Lose Weight For Woman & Men: పైనాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే.. భారతదేశ వ్యాప్తంగా ఈ పండుకు అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.. కాబట్టి శరీర బరువును కూడా నియంత్రించేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని శరీరాన్ని రక్షిస్తుంది. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు పైనాపిల్ ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ పండును ఉపయోగించి ఎలా తగ్గించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పైనాపిల్‌తో బరువు తగ్గడం ఎలా?:
తక్కువ కేలరీలు:
100 గ్రాముల పైనాపిల్ లో 55 కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు తీసుకునే డైట్లో పైనాపిల్ తో తయారు చేసిన రసాన్ని లేదా మొక్కలను తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రించి మంచి కొలెస్ట్రాలను పెంచేందుకు సహాయపడుతుంది. వేగంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు పైనాపిల్ రసాన్ని తాగాలి.
Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్
ఫైబర్ అధిక మోతాదులో లభిస్తుంది:
100 గ్రాముల పైనాపిల్ లో 2.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ప్రతిరోజు ఈ పండుతో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు తాజా పండును ముక్కలుగా కట్ చేసుకుని సలాడ్స్ లో తీసుకోవడం వల్ల సులభంగా విముక్తి లభిస్తుంది. ప్రతిరోజు పైనాపిల్ రసాన్ని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది:
అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలామందిలో జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీని కారణంగా బరువు పెరగడం, మలబద్ధకం ఇతర సమస్యల బారిన పడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు పైనాపిల్ ముక్కలను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు దూరమై.. శరీరంలో జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వాపును తగ్గిస్తుంది:
శరీర బరువు పెరగడం కారణంగా మందిలో చర్మం ఉబ్బెత్తుగా తయారవుతోంది. అంతేకాకుండా మరికొంతమందిలో చర్మంపై వాపులు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు పైనాపిల్ తో తయారు చేసిన రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చర్మం పై వాపు సమస్యలను తగ్గించి. శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా చర్మంపై మంటను తగ్గించేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది.
Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి