Orange Side Effects: పోషక పదార్ధాలతో పుష్కలంగా ఉండే ఆరెంజ్ ఫ్రూట్స్ అందరికీ ఇష్టమే. అదే సమయంలో ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. కానీ కొంతమంది మాత్రం ఆరెంజ్ నుంచి దూరంగా ఉండాల్సిందేనంటున్నారు వైద్య నిపుణులు.
వాస్తవానికి నారింజ లేదా బత్తాయి పండ్లలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి న్యూట్రియంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇంతటి అద్భుతమైన పోషక పదార్ధాలున్న ఆరెంజ్ ఆరోగ్యానికి మంచిదే అయినా..కొంతమందికి కొన్ని పరిస్థితుల్లో తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరెంజ్ ఎవరెవరు ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరెంజ్ ఎవరెవరు తినకూడదు
కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందిపడేవాళ్లు బత్తాయి పండ్లు తినకూడదు. ఎందుకంటే కడుపు పట్టేయడం, అజీర్ణం వంటి సమస్యలు ఎదురౌతాయి. ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ కారణంగా విరేచనాలు కూడా రావచ్చు. ఇక కొంతమందికి హఠాత్తుగా కడుపు నొప్పి వస్తుంటుంది. ఆ పరిస్థితుల్లో ఆరెంజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే యాసిడ్ కడుపు నొప్పిని మరింత పెంచుతుంది.
ఎసిడిటీ సమస్య ఉన్నవాళ్లు కూడా ఆరెంజ్ జ్యూస్ తీసుకోకూడదు. దీనివల్ల కడుపులో, ఛాతీలో మంట పెరుగుతుంది. పళ్లలో కేవిటీ సమస్యతో బాధపడేవారు కూడా ఆరెంజ్‌కు దూరంగా ఉండాలి. ఇందులో ఉండే ఓ విధమైన యాసిడ్..పళ్లలో ఉండే ఎనామిల్ సహిత కాల్షియంతో మిక్స్ అయితే..బ్యాక్టీరియల్ ఇన్‌పెక్షన్ వస్తుంది.కేవిటీ సమస్య ఉండేవాళ్లు ఆరెంజ్ తింటే సమస్య మరింతగా పెరుగుతుంది.
Also read: Amla Benefits: ఉసిరిని ఇలా వండుకుని తింటే అద్భుత ప్రయోజనాలు, మధుమేహానికి దివ్య ఔషధం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook