GBS Virus Threat: ఇండియాలో మరో కొత్త వైరస్, ప్రమాదకరమంటున్న వైద్యులు

GBS Virus Threat: చైనా హెచ్ఎంపీవీ వైరస్ సంగతేమో గానీ ఇప్పుడు ఇండియాలో మరో కొత్త వైరస్ భయపెడుతోంది. పూణేలో వెలుగు చూసిన అరుదైన వైరస్ వ్యాప్తి ఆందోళన కల్గిస్తోంది. ఇది ప్రమాదకరమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 25, 2025, 01:19 PM IST
GBS Virus Threat: ఇండియాలో మరో కొత్త వైరస్, ప్రమాదకరమంటున్న వైద్యులు

GBS Virus Threat: మహారాష్ట్ర పూణే నుంచి కొత్త వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. అత్యంత అరుదుగా భావిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ కలవరం రేపుతోంది. అప్పుడే వీటి సంఖ్య 71కి చేరింది. ఈ వ్యాధి తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక ర్యాపిడ్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేసింది. 

మహారాష్ట్ర పూణేలో వెలుగుచూసిన గులియన్ బారే సిండ్రోమ్ స్థూలంగా చెప్పాలంటే జీబీఎస్ వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 71 కేసులు నమోదు కాగా వీరిలో 14 మది వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటూ ఉండటం ఆందోళన కల్గించే విషయంగా ఉంది. ఇదొక న్యూరోలాజికల్ డిజార్డర్. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి నరాల బలహీనత, తిమ్మిరి, పక్షపాతం వంటి వాటికి దారితీస్తుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు సరికదా కోలుకునేందుకు చాలా సమయం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ వ్యాధి ఆందోళన కల్గిస్తోంది. ఈ వ్యాధికి గురైన రోగులు మంచానపడాల్సి వస్తోంది. ఈ వ్యాధి లక్షణాలు బయటపడటానికి ముందు శ్వాస సంబంధిత లక్షణాలు కన్పిస్తాయి. 

జీబీఎస్ లక్షణాలు ఇలా

బాధితులు మెట్లెక్కడం, నడవడం కష్టమౌతుంది. నరాల బలహీనత, కాళ్లు -చేతులు , ముఖం-శ్వాస కండరాలు పూర్తిగా పటుత్వం కోల్పోవచ్చు. నరాలు దెబ్బతినడంతో మెదడు నుంచి అసాధారణ సంకేతాలు కన్పిస్తాయి. హార్ట్ బీట్ వేగంగా ఉంటుంది. రక్తపోటులో మార్పు కన్పిస్తుంది. జీర్ణక్రియ సమస్య, మూత్రాశయం నియంత్రణ సమస్యగా మారుతుంది. 

Also read: Ind vs Eng: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండవ టీ20 నేడే, ఇరు జట్ల బలాబలాలు, పిచ్ స్వభావం ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News