Best Cooking Oils: మనం తీసుకునే ఆహారం పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఏం తింటున్నాం.. ఎంత తింటున్నామనేది చాలా ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తు చాలా మందికి ఈ స్పృహ ఉండదు. ఇలా ఆహారం పట్ల అలసత్వంగా ఉంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారిలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వంట నూనెలు అన్నీ ఆరోగ్యానికి చెడు చేయవు.
వంట నూనెల్లో సంతృప్త కొవ్వులు, అసంతృప్త కొవ్వులు ఉండే ఆయిల్స్ ఉంటాయి. ఈ రెండింటిలో అసంతృప్త కొవ్వులు (అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్) ఉండే ఆయిల్ ఆరోగ్యానికి మంచిది. సంతృప్త కొవ్వులు (సాచురేటెడ్ ఫ్యాట్) ఉండే ఆయిల్ ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ నిఖిల్ వాట్స్ ప్రకారం.. భారత్‌లో దొరికే వంట నూనెల్లో ఐదు రకాల వంటలు ఆరోగ్యానికి మంచివి.
ఆ ఐదు రకాల వంట నూనెలు ఇవే :
1. ఆలివ్ ఆయిల్
2. సన్‌ఫ్లవర్ ఆయిల్
3. కార్న్ ఆయిల్
4. వైట్ మస్టర్డ్ ఆయిల్
5. నట్స్ ఆయిల్
ఇవి పాటిస్తే అధిక కొలెస్ట్రాల్ బారిన పడకుండా ఉండొచ్చు :
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి
జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినవద్దు
రోజూ వ్యాయామం చేయాలి
బీటా గ్లూకాన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.
మద్యపానానికి దూరంగా ఉండాలి.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారాన్ని స్వీకరించే ముందు.. కచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Sonia Gandhi: మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందుకు సోనియా గాంధీ..భగ్గుమన్న కాంగ్రెస్..!
Also Read: TV Actress: పరిశ్రమలో తీవ్ర విషాదం.. క్యాన్సర్ తో ప్రముఖ నటి దుర్మరణం!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook