Kidney Disease Causes: కిడ్నీ వ్యాధులు ఉత్తరాదివారిలోనే ఎక్కువగా ఉంటున్నాయా, కారణమేంటి

Kidney Disease Causes: మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, లివర్ ఎంత ముఖ్యమైనవో కిడ్నీలు కూడా అంతే ప్రాధాన్యత కలిగినవి. కిడ్నీలు విఫలమైతే ప్రాణాంతకం కావచ్చు. అందుకే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 14, 2024, 08:21 PM IST
Kidney Disease Causes: కిడ్నీ వ్యాధులు ఉత్తరాదివారిలోనే ఎక్కువగా ఉంటున్నాయా, కారణమేంటి

Kidney Disease Causes: సాధారణంగా కిడ్నీలు దెబ్బతినడానికి ప్రధాన కారణంగా చెడు ఆహారపు అలవాట్లు. మనం తినే తిండిలో పూర్తి స్థాయిలో పోషకాలు లేనప్పుడు కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దురదృష్టవశాత్తూ ఆదునిక జీవనశైలి కారణంగా పోషకాలు లేని ఆహారమే ఇటీవలి కాలంలో ఎక్కువగా తింటున్నారు. ఫలితంగా శరీరంపై దుష్పరిణామాలు కూడా ఎక్కువే కలుగుతుంటాయి. 

కడుపు నిండుగా తినడం అనేది ముఖ్యం కాదు. ఏం తింటున్నామనేదే ముఖ్యం. ఎందుకంటే ఉత్తరాదిలోని యూపీ, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ఇలా హిందీ మాట్లాడే ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి కేసులు పెరుగుతున్నట్టు వివిధ అధ్యయనాల్లో గుర్తించారు. కారణంగా సరైన పోషకాహారం కలిగిన తిండి తినకపోవడమే. చాలామంది ప్రోటీన్లు, మినరల్స్, పొటాషియం వంటి పోషకాలకు దూరంగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. మరి మీరు కూడా ఉత్తరాదికి చెందినవారైతే మీ డైట్ నుంచి ఏం తొలగించాలి, ఏం చేర్చాలనేది తెలుసుకుందాం.

ఉత్తరాదిన పోషకాహారం తినడం లేదనే సంగతి చండీగడ్‌లోని పీజీఐ ఆసుపత్రి, జార్జ్ ఇనిస్టిట్యూట్ ఆప్ పబ్లిక్ హెల్త్ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ఉత్తరాది తిండి అలవాట్ల ఆధారంగా చేశారుు. దాదాపు 400 మంది ఆహారపు అలవాట్లను పరిశీలించారు. వీరిలో సగం మంది సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటే..మిగిలిన సగం మంది కిడ్నీ వ్యాధితో సతమతమౌతున్నారు. అందరిలోనూ ఉప్పుు ఎక్కువగా ఉండటం, పొటాషియం, ప్రోటీన్ తక్కువగా ఉండటాన్ని గమనించారు. వాస్తవానికి శరీరానికి ఉప్పు అవసరమే కానీ మోతాదుకు మించి ఉండకూడదు. ఎక్కువైతే చాలా వ్యాధులు ప్రారంభమౌతాయి. అనారోగ్యకరమైన ఆహారంతో కిడ్నీ, బ్లడ్ ప్రెషర్, గుండె వ్యాధులు ఉత్పన్నం కావచ్చు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉప్పు ఎక్కువ తినడం వల్ల 30 లక్షలమంది మరణిస్తున్నారు. చాలామంది భారతీయులకు ఇది తెలిసినా సరే ఉప్పు వల్ల కలిగే దుష్పరిణామాలు తెలియక వదల్లేకపోతున్నారు. అందుకే ఇంట్లో తినే తిండిలో సాధ్యమైనంతవరకూ ఆయిల్, ఉప్పు, పంచదార తగ్గించుకుంటే మంచిది. అన్నింటికంటే ఎక్కువ నష్టం కలిగేది ప్యాక్డ్ ఫుడ్స్ వల్లనే. సెప్టెంబర్ నెలలో ఇండియాలో లబించే 43 రకాల ప్యాకెట్ ఫుడ్స్‌ను విశ్లేషించగా అందులో ఉప్పు, పంచదార, ఫ్యాట్ అవసరానికి మించి ఉన్నట్టు తేలింది. ఇక కేక్, పేస్ట్రీ, చిప్స్, బిస్కట్స్, ఇన్‌స్టంట్ నూడిల్స్, సాఫ్ట్ డ్రింక్స్‌లో కూడా ఇదే పరిస్థితి.

ఓ సాధారణ మనిషి తినే తిండిలో కూరగాయలు 350 గ్రాములు, పండ్లు 150 గ్రాములు, పప్పులు-బీన్స్-గుడ్లు-మాంసం 90 గ్రాములు ఉండాలి. ఇక డ్రై ఫ్రూట్స్ 30 గ్రాములు, ఆయిల్-ఘీ 27 గ్రాములు ఉండాలి. అన్ని రకాల పిండి, బియ్యం, మక్కా, జొన్నలు కలిపి 240 గ్రాములు ఉండాలి. ఈ పరిమాణం కంటే తక్కువైనప్పుడు వివిధ రకాల అనారోగ్య సమస్యలు మొదలౌతాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు వెంటాడుతాయి. 

Also read: Jamun Fruit: నేరేడు పండు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News