Jackfruit For Diabetes: మన దేశంలో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజరోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న వయసులో కూడా ఈ వ్యాధి బారిన పడడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం నియంత్రణలో ఉండాలంటే.. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు కూడా తప్పకుండా నియంత్రణలో వుండాల్సిందే.
డయాబెటిస్తో బాధపడుతున్న వారు చాలామంది మార్కెట్లో లభించే అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తింటున్నారు. దీంతో ఆగకపోవడమే కాకుండా విచ్చలవిడిగా స్వీట్స్ ను కూడా తింటున్నారు. స్వీట్స్ తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు అధికంగా పెరిగి మధుమేహం తీవ్రత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్వీట్ తినాలని కోరుకున్న వారు మేము ఈరోజు పరిచయం చేయబోయే స్వీట్స్ ప్రతిరోజు తినండి.
మేము ఈరోజు పరిచయం చేయబోయే లడ్డును ప్రతిరోజు మధుమేహం ఉన్నవారు తినడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు సులభంగా నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి జాక్‌ఫ్రూట్ తో తయారుచేసిన లడ్డు ఉపశమనం కలిగిస్తుంది. ఎలా తయారు చేసుకోవాలో.. లడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసినవి పదార్థాలు:
బాదంపప్పు 3 కప్పులు, జాక్‌ఫ్రూట్ మిశ్రమం 3 కప్పులు, 1/2 కప్పు ఆలివ్ నూనె, 2 టేబుల్ స్పూన్ అల్లం పొడి, 1 టీస్పూన్ యాలకుల పొడి, 2 కప్పుల స్వీటెనర్, 1 పెద్ద చెంచా నెయ్యి.
లడ్డు తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక బౌల్ సిద్ధం చేసుకోవాలి. అందులో ముందుగా నెయ్యి వేసి బెల్లం వేసి కరగనివ్వాలి. ఇలా కలిగిన తర్వాత 15 నిమిషాల తర్వాత పాకంగా తయారవుతుంది అందులో జాక్ ఫ్రూట్ మిశ్రమం వేసి, యాలకుల పొడిని వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత రెండు కప్పుల స్వీటెనర్, ఆలివ్ నూనె వేసి దింపేసుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న బౌల్లో మిశ్రమం చల్లారినాక చిన్న చిన్న లడ్డూలుగా చేసుకొని దానిపై ఒక బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లడ్డుని ప్రతిరోజు రెండుసార్లు తింటే రక్తంలోని చక్కర పరిమాణాలు తగ్గడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read : Ram Charan Video Call : గుడ్ న్యూస్ చెప్పబోతోన్న ప్రభాస్!.. లీక్ చేసిన రామ్ చరణ్
Also Read : Anasuya Bharadwaj White Dress : బొడ్డు చూపిస్తున్న జబర్దస్త్ బ్యూటీ.. తెలుపు దుస్తుల్లో అనసూయ అందాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook