Honey Mixed With Milk: పాలలో పసుపు తేనె మిక్స్ చేసుకొని తాగితే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడైనా మీరు ట్రై చేశారా?

Honey Mixed With Milk: ప్రస్తుతం చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. 50 శాతం మంది పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలతో బాధపడే వారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను ప్రతిరోజు పాటించండి.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 10, 2023, 05:16 PM IST
Honey Mixed With Milk: పాలలో పసుపు తేనె మిక్స్ చేసుకొని తాగితే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడైనా మీరు ట్రై చేశారా?

Honey Mixed With Milk: ఆధునిక జీవనశైలి కారణంగా చర్మ సమస్యలతో పాటు అధికంగా పొట్ట సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జీవనశైలిలో పాటు తీసుకునే ఆహారంలో మార్పులు తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఈ చిన్న సమస్యలే ప్రాణాంతకంగా మారవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి సమస్యల కారణంగానే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు కాబట్టి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదంటున్నారు నిపుణులు..

పొట్ట సమస్యలు భాగంగా చాలామందిలో అజీర్ణం, మలబద్ధకం, పొట్టలో గ్యాస్, కడుపులో తిప్పడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల పొట్ట సమస్యలు దూరం అవ్వడమే కాకుండా.. దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆయుర్వేద నిపుణులు సూచించిన చిట్కా ప్రకారం ప్రతిరోజు పాలలో పసుపు కలుపుకొని పొడిగడుపున తాగితే పొట్ట సమస్యల ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు పొట్ట సమస్యలను తగ్గించడమే కాకుండా చర్మాన్ని మృదువుగా చేసేందుకు కూడా సహాయపడతాయి. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు పసుపు పాలను ఉదయం ఖాళీ కడుపుతో తాగాల్సి ఉంటుంది. 

అంతేకాకుండా పసుపు పాలలో తేనెను కలుపుకొని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తేనెలో ఉండే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని అన్ని రకాల సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శరీర బలహీనత నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పాలలో తేనె కలుపుకొని తాగాల్సి ఉంటుంది.

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్

ముఖ్యంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పసుపు సీజనల్‌ వ్యాధులను కూడా సులభంగా తగ్గిస్తుంది. కాబట్టి జలుబు దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పాలను తాగాలి.

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News