Honey Health Tips: రోజూ తేనె ఇలా తీసుకుంటే..4 వారాల్లోనే స్థూలకాయానికి చెక్

Honey Health Tips: తేనె నిజంగానే ఓ అమృతం. అంతటి అద్భుత ప్రయోజనాలున్నాయి. తేనె తీసుకునే విధానాన్ని బట్టి ప్రయోజనాలు మారుతుంటాయి. తేనెతో కలిగే అద్భుత ప్రయోజనాలు, ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 31, 2022, 11:52 PM IST
Honey Health Tips: రోజూ తేనె ఇలా తీసుకుంటే..4 వారాల్లోనే స్థూలకాయానికి చెక్

Honey Health Tips: తేనె నిజంగానే ఓ అమృతం. అంతటి అద్భుత ప్రయోజనాలున్నాయి. తేనె తీసుకునే విధానాన్ని బట్టి ప్రయోజనాలు మారుతుంటాయి. తేనెతో కలిగే అద్భుత ప్రయోజనాలు, ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం..

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. అందుకే వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్‌కు వెళ్లడం, వాకింగ్, యోగా చేయడం, డైటింగ్ చేయడం ఇలా ఎన్నో పద్థతులు అవలంభిస్తుంటారు. ప్రకృతిలో లభించే అద్భుతమైన ఔషధం తేనెతో ఈ సమస్యకు చెక్ పెట్టేయవచ్చు. తేనెతో ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. తేనెలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, విటమిన్ బీ6, కార్బోహైడ్రేట్స్, ఎమైనా యాసిడ్స్ వంటి పోషకాలు ఏ విధమైన ఇన్‌ఫెక్షన్‌ను దరిచేరనివ్వవు. శరీరానికి అంతగా రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. ప్రతిరోజూ పరగడుపున తేనె సేవించడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడం, జలుబు, జ్వరం వంటి ఇన్‌ఫెక్షన్లు దూరమవడం, ఇమ్యూనిటీ పెరగడం ఇలా చాలా రకాలుగా ప్రయోజనం కల్గిస్తుంది. గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకుని రోజూ పరగడుపున సేవిస్తుంటే..ఒత్తిడి దూరమౌతుంది. 

పరగడుపున తేనెతో లాభాలు

ఆరోగ్యంగా ఉండేందుకు తేనెతో చాలా ప్రయోజనాలు, మార్గాలున్నాయి. తేనెను ప్రతిరోజూ క్రమం తప్పకుండా సేవిస్తే మంచి ఫలితాలుంటాయి. ప్రతిరోజూ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలుపుకుని పరగడుపున తాగితే సులభంగా బరువు తగ్గుతారు. ఇలా తాగడం వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు వేగంగా కరుగుతుంది. ఇందులో కొద్గిగా నిమ్మరసం  లేదా జీలకర్ర పౌడర్ కలుపుకుంటే ఇంకా మంచిది. రోజూ క్రమం తప్పకుండా గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేెనె, నిమ్మరసం కలిపి తాగితే అద్భుత ప్రయోజనాలుంటాయి. బరువు తగ్గడమే కాకుండా..లంగ్స్ సంబంధిత సమస్యలు దూరమౌతాయి.

గొంతు సంబంధిత సమస్యలు

దగ్గు తగ్గించేందుకు తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గొంతులో కఫాన్ని దూరం చేస్తాయి. ఫలితంగా దగ్గు కూడా తగ్గుతుంది. దీనికోసం రోజూ గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకుని సేవించాలి. చాలామందికి గొంతులో గరగర అధికంగా ఉంటుంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు పరగడుపున తేనెను వాము లేదా అల్లంతో కలిపి తీసుకుంటే మంచి ఫలితముంటుంది. గొంతులో గరగర తగ్గడమే కాకుండా కఫం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

Also read: Milk with Dry grapes: పాలలో ఎండుద్రాక్ష కలిపి తీసుకుంటే..మెమరీ పవర్ పెరగడం ఖాయం

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News