Heart Attack Pain: ప్రస్తుతం చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా కొందరు ఆరోగ్యంపై అశ్రద్ధ వహించడం వల్ల ప్రాణాంతంగా మారుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం చిన్న వయసులో కూడా గుండె జబ్బుల నుంచి గుండెపోటు వంటి సమస్యలను ఎదుర్కోవడం విశేషం. చాలా మందిలోని ఇది తీవ్ర వ్యాధిగా మారి.. చివరకు మరణిస్తున్నారు. అయితే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రోటిన్లు గల ఆహారం తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.
చిన్న వయసుల్లోనే ఇలాంటి సమస్యలకు బారిన పడిన వారు కచ్చితంగా పలు రకాల ఆహార నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ఎలాంటి వ్యాధులు రావని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆహారాలు తీసుకుంటే పదార్థాలు తీసుకుంటే గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది:
డ్రైప్రూట్స్:
క్రమం తప్పకుండా నట్స్ తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయని నిపుణులు తెలుపుతున్నారు. నట్స్‌లో అసంతృప్త కొవ్వు ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, అమినో యాసిడ్‌లు గుండెకు మేలు చేస్తాయి.
తృణధాన్యాలు:
బ్రౌన్ రైస్, తృణధాన్యాల నుంచి తయారైన వస్తువులు హృదయానికి చాలా రకాలుగా మేలు చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిలో కరిగే ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది. కావున శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
వెల్లుల్లి:
వెల్లుల్లి ఏదైనా వంటకం రుచిని పెంచడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఆరోగ్యానికి కావాల్సిన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అయితే గుండు సమస్యలను నియంత్రించేందుకు వెల్లుల్లి వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి రక్షించేందుకు కృషి చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పప్పులు:
గుండె ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంచేందుకు పప్పులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే గుండె సమస్యలతో బాధపడుతున్న వారు పప్పు దినుసులతో చేసిన ఆహారాలను తీసుంటే మంచిదని ఆయుర్వేదం పేర్కొన్నారు. ముఖ్యంగా వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Radhana Ram: ఇండస్ట్రీకి మరో వారసురాలు..ఏకంగా పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook