Healthy food for Heart: మీ డైట్‌లో ఆ ఫ్రూట్స్ చేర్చుకుంటే..ఇక గుండె పదిలమే

Healthy food for Heart: దేశంలో గుండెపోటు రోగుల సంఖ్య పెరుగుతోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తినడమే కారణంగా తెలుస్తోంది. గుండె సంబంధిత వ్యాధుల్నించి రక్షించుకోవాలంటే..ఆహారపు అలవాట్లు మారాలంటున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 16, 2022, 05:11 PM IST
Healthy food for Heart: మీ డైట్‌లో ఆ ఫ్రూట్స్ చేర్చుకుంటే..ఇక గుండె పదిలమే

Healthy food for Heart: దేశంలో గుండెపోటు రోగుల సంఖ్య పెరుగుతోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తినడమే కారణంగా తెలుస్తోంది. గుండె సంబంధిత వ్యాధుల్నించి రక్షించుకోవాలంటే..ఆహారపు అలవాట్లు మారాలంటున్నారు.

గుండె అనేది అతి ముఖ్యమైన భాగం. ప్రాణం పోసుకున్నప్పటి నుంచి ప్రాణం పోయేంతవరకూ ఇది కొట్టుకుంటూనే ఉంటుంది. కొట్టుకోవడం ఆగిందంటే అదే ఆఖరి శ్వాసగా అర్ధం. అందుకే శరీరంలోని అన్ని భాగాల్లో గుండెను అత్యంత పదిలంగా కాపాడుకోవాలి. గుండెను పట్టించుకోకపోతే..హార్ట్ ఎటాక్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయి. గుండె పదిలంగా ఉండాలంటే..ఆయిలీ ఫుడ్స్ దూరంగా పెట్టాలి. ప్రముఖ వైద్యుల సూచనల ప్రకారం ఎల్లో ఫ్రూట్స్, ఎల్లో కూరగాయలు గుండె ఆరోగ్యానికి మంచిదని తెలుస్తోంది. 

మామిడి, నిమ్మ

మామిడి పండును పండ్లలో రారాజుగా పిలుస్తారు. అంతటి రుచి మాత్రమే కాకుండా పోషక గుణాలు అద్భుతంగా ఉంటాయి. మామిడి పండ్ల కోసం ప్రతి వేసవి కోసం ఎదురుచూస్తుంటాం. మామిడి పండ్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు. ఇక మరో ఎల్లో ఫ్రూట్..నిమ్మ కాయలు. నిమ్మకాయలో కూడా ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. గుండె ఆరోగ్యంతో పాటు బరువు తగ్గడంలో నిమ్మ పాత్ర చాలా ప్రత్యేకం. 

అరటిపండ్లు, పైనాపిల్

సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడుగునా దొరికే అద్భుతమైన ఔషద గుణాలుండేది అరటి పండ్లు. ఎంత సులభంగా తినవచ్చో..అంత అద్భుతమైన పోషకాలుంటాయి. పరిమితంగా తీసుకుంటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక పైనాపిల్ ఇంటే ఇష్టపడనివారుండరు. కేవలం రుచిలోనే కాకుండా గుండెను పటిష్టంగా ఉంచడంలో పైనాపిల్ చాలా ఉపయోగపడుతుంది. అయితే పరిమితి దాటి తినకూడదు. 

ఎల్లో షిమ్లా మిర్చ్

ఇందులో ఫైబర్, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా లబిస్తాయి. ఫలితంగా మనిషికి అవసరమైన ఎనర్జీ లభిస్తుంది. దాంతోపాటు శరీరంలో రక్త హీనత ఉంటే తొలగిపోతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Also read: Belly Fat Reduce: పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడానికి ఆయుర్వేద చిట్కాలు ఇవే.. ఇలా చేస్తే కొలెస్ట్రాల్‌ 6 రోజుల్లో మటు మాయం..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News