Chest Pain: తరచూ ఛాతీ నొప్పి వస్తోందా, ఈ చిట్కాలు పాటిస్తే ఛెస్ట్ పెయిన్ నుంచి ఉపశమనం

Chest Pain: ఛాతీ నొప్పి అనేది ఇటీవలి కాలంలో సర్వ సాధారణంగా మారిపోయింది. కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు. ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలో చాలామందికి అర్ధం కాదు. ఆ వివరాలు మీ కోసం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 14, 2022, 04:55 PM IST
Chest Pain: తరచూ ఛాతీ నొప్పి వస్తోందా, ఈ చిట్కాలు పాటిస్తే ఛెస్ట్ పెయిన్ నుంచి ఉపశమనం

ఇటీవలి కాలంలో ఛెస్ట్ పెయిన్ సమస్య పెరిగిపోతోంది. కొన్ని సందర్భాల్లో భరించలేని నొప్పి ఉంటుంది. అందుకే ఛాతీ నొప్పి ప్రారంభంలోనే తగ్గించాలి. దీనికోసం కొన్ని చిట్కాలున్నాయి. నొప్పి అధికమైతే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. తేలికపాటి నొప్పి ఉంటే మాత్రం కొన్ని చిట్కాలతో దూరం చేయవచ్చు.

ఛాతీ నొప్పి దూరం చేసే చిట్కాలు

బాదాం

ఒకవేళ తిన్న తరువాత మీకు ఛాతీలో నొప్పిగా ఉంటే..ఇది యాసిడ్ రిఫ్లక్స్ కావచ్చు. ఈ క్రమంలో రోజూ బాదం తింటే మంచి ఫలితాలుంటాయి. లేదా బాదం పాలు తాగినా మంచిదే. ఇలా చేయడం వల్ల ఛాతీ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది కాకుండా ఉదయం పరగడుపున నానబెట్టిన బాదం తింటే ఇంకా మంచిది.

యాపిల్ సైడర్ వెనిగర్

యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా ఏర్పడే హార్ట్ పెయిన్ దూరం చేసేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ వినియోగిస్తే మంచి ఫలితాలుంటాయి. దీనివల్ల భోజనానికి ముందు లేదా నొప్పిగా ఉన్నప్పుడు ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగాలి. దీనివల్ల ఛాతీ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

హాట్ డ్రింక్స్

గ్యాస్, బ్లోటింగ్ కారణంగా ఛాతీ నొప్పి వస్తే..ఆ సమయంలో హాట్ డ్రింక్స్ సేవిస్తే మంచి ప్రయోజనముంటుంది. ఛాతీ నొప్పి సమస్య దూరమౌతుంది. ఇది బెస్ట్ హోమ్ రెమెడీ.

పసుపు పాలు

పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అందుకే పసుపు పాలు తీసుకుంటే ఛాతీ నొప్పి సమస్య తగ్గుతుంది. ఒక కప్పు వేడి పాలలో ఒక స్పూన్ పసుపు కలుపుకుని తాగితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గుతుంది. 

Also read: Cancer types and symptoms: మహిళల్లో వచ్చే 6 కేన్సర్ రకాలు, వాటి లక్షణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News