High Cholesterol Signs: ఈ లక్షణాలు మీలో గమనిస్తే ఇక అంతే సంగతి.. జాగ్రత్త సుమీ!

High Cholesterol Signs: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా  అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. కొన్ని సంకేతాల ద్వారా ఈ సమస్యల్ని ముందే ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 11, 2023, 04:25 PM IST
High Cholesterol Signs: ఈ లక్షణాలు మీలో గమనిస్తే ఇక అంతే సంగతి.. జాగ్రత్త సుమీ!

Hihg Cholesterol Signs: శరీరంలో అంతర్గతంగా తలెత్తే కొన్ని సమస్యలు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు కొన్ని లక్షణాలు బయటకు కన్పిస్తాయి. ఈ లక్షణాల్ని వెంటనే పసిగట్టి చికిత్స చేయించుకోవాలి. ఎందుకంటే కొలెస్ట్రాల్ అనేది అత్యంత ప్రమాదకరమైన లైఫ్‌స్టైల్ డిసీజ్.

రక్తంలో పేరుకుపోయే కొలెస్ట్రాల్ అత్యంత ప్రమాదకరమైంది. కొలెస్ట్రాల్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు చాలా వెంటాడుతుంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు రక్త నాళికల్లో బ్లాకేజ్ ఏర్పడి..రక్తం గుండెకు ,శరీరంలోని ఇతర భాగాలకు చేరడంలో ఆటంకం కలుగుతుంది. ఫలితంగా అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్ వంటి కొరోనరీ వ్యాధులు ఎదుర్కోవల్సివస్తుంది. కొలెస్ట్రాల్ కారణంగా డయాబెటిస్ వంటి మరో ప్రమాదకరవ్యాధి ప్రారంభమౌతుంది. అందుకే ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ లక్షణాల్ని గుర్తించడం అవసరం.

కొలెస్ట్రాల్ ఎక్కువైతే కన్పించే లక్షణాలు

కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ శరీరంలో వివిధ రకాల హెచ్చరికలు జారీ అవుతుంటాయి. ఈ లక్షణాల్ని మీరు గుర్తించగలిగితే ఇతర సీరియస్ వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు. కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగినప్పుడు కాళ్లలో విచిత్రమైన పరిస్థితి కన్పిస్తుంది. ఇలాంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. తక్షణం లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి.

Also Read: Strong Bones: ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా, ఈ పండ్లు రోజూ తీసుకుంటే చాలు

రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కాళ్లలో రక్త సరఫరాలో ఇబ్బంది ఏర్పడి తరచూ కాళ్లు తిమ్మిరి పట్టడం జరుగుతుంటుంది. కాళ్లలో తిమ్మిరి లేదా మంట వంటి సమస్యలు కన్పిస్తాయి.

శరీరంలోని కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు ధమనుల్లో ఇబ్బంది ఏర్పడుతుంది. కాళ్లలో రక్త సరఫరా లోపిస్తుంది. దాంతో కాళ్లు చల్లగా మారిపోతుంటాయి.

బ్లాకేజ్ కారణంగా రక్త సరఫరా మందగిస్తుంది. దాంతో ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గుతుంది. శరీరంలోని అన్ని భాగాలకు సక్రమంగా రక్తం, ఆక్సిజన్ సరఫరా కాదు. ఫలితంగా కాళ్లు విపరీతంగా నొప్పి, లాగడం జరుగుతుంటుంది.

చెడు కొలెస్ట్రాల్ కారణంగా కాలి గోర్లలో తేడా కన్పిస్తుంది. గోర్లు సాధారణంగా లేత గులాబీ రంగులో ఉంటాయి. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు రక్త సరఫరా లోపించడం వల్ల గోర్లు పసుపుగా కన్పిస్తాయి. లేదా గోర్లలో గీతలు ఏర్పడుతుంటాయి.

కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టాలంటే ఆకుపచ్చని కూరగాయలు ఎక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఫైబర్ ఆధారిత పదార్ధాలు తరచూ తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండటం మంచిది. మసాలా పదార్ధాలు, నాన్ వెజ్ పూర్తిగా తగ్గించాలి. రోజుకు కనీసం 7-8 గ్లాసున నీళ్లు తాగాలి. జీర్ణక్రియ బాగుండేట్టు చూసుకోవాలి. 

Also read: Diabetes Diet Fruits: మధుమేహం వ్యాధిగ్రస్థులు మామిడి పండ్లు తినవచ్చా లేదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News