Liver Damage Foods: గుండె, కిడ్నీల పనితీరు మనిషి ప్రాణాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో లివర్ పనితీరు కూడా అదే రీతిలో ప్రభావం చూపిస్తుంది. ఇటీవలి కాలంలో లివర్ సంబంధిత సమస్యలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. లివర్ అనారోగ్యం అంటే మొత్తం శరీరమే అనారోగ్యమైనట్టు అర్ధం.
లివర్ అనేది మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం. లివర్ పాడైతే చాలా సమస్యలు వెంటాడవచ్చు. లివర్ పాడవడానికి కారణం కూడా మన ఆహారపు అలవాట్లే. కొన్ని రకాల పదార్ధాలు లివర్‌ను పాడు చేస్తుంటాయి. అందుకే హెల్తీ ఫుడ్ అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే లివర్ పాడయ్యే అవకాశాలున్నాయి. మనలో చాలామంది బయటి తిండి తినడాన్ని ఇష్టపడుతుంటారు. ఇది మీ ఆరోగ్యానికి హాని కల్గిస్తుంది. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పదార్ధాలు తినకూడదో తెలుసుకుందాం..
ఫాస్ట్ ఫుడ్స్ అనేవి ఆరోగ్యానికి మంచివి కావు. జీర్ణం చేయడంలో ఇబ్బంది ఎదురౌతుంది. అందుకే బర్గర్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి పదార్ధాలను సాధ్యమైనంతవరకూ దూరం పెట్టడం మంచిది. ఇవి లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
ఇక రెండవది మైదా. మైదాను వైట్ పాయిజన్‌గా పిలుస్తారు. మైదాతో చేసే పదార్ధాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇందులో మినరల్స్, ఫైబర్, విటమిన్లు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను పెంచుతుంది. పాస్తా, పిజ్జా, బ్రెడ్, బిస్కట్ వంటి పదార్ధాలన్నీ మైదాతో తయారయ్యేవే. మైదా పదార్ధాలు తినడం వల్ల లివర్ దెబ్బతింటుంది.
పంచదార కూడా ఆరోగ్యానికి చాలా హాని కల్గిస్తుంది. స్థూలకాయం పెంచడంతో పాటు లివర్‌ను పాడు చేస్తుంది. అందుకే లివర్ సంబంధిత సమస్యలుంటే తక్షణం మీ డైట్ నుంచి పంచదార లేదా స్వీట్స్ దూరం చేయాలి.
లివర్‌ను పాడుచేసే వాటిలో అతి ముఖ్యమైంది మద్యం. మద్యం నేరుగా లివర్‌పైనే ప్రభావం చూపిస్తుంది. మద్యంకు అలవాటై ప్రాణాలు పోగొట్టుకున్నవారిలో దాదాపు అందరికీ ఒకటే కారణం కన్పిస్తుంది. అది లివర్ డ్యామేజ్ కావడం. మద్యం తరచూ తాగేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే మద్యం అలవాటు మానేయాలి.
Also Read: Heart Health: పంచదార లేదా ఉప్పు, గుండె ఆరోగ్యానికి ఏది ప్రమాదకరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , FacebooKమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి