Honey Benefits: దగ్గు, కఫం సీజనల్ వ్యాధులకు ఇదే అద్భుత పరిష్కారం, తేనెతో లాభాలివే

Honey Benefits: సీజన్ మారితే చాలు సవాలక్ష సమస్యలు వచ్చి పడుతుంటాయి. దగ్గు, జ్వరం, జలుబు ఇలా ఒకదానివెంట మరొకటి పీడిస్తుంటాయి. వర్షాకాలం నుంచి శీతాకాలంలోకి ప్రవేశించగానే మొదలయ్యే అనారోగ్య సమస్యల్నించి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 10, 2023, 06:53 PM IST
Honey Benefits: దగ్గు, కఫం సీజనల్ వ్యాధులకు ఇదే అద్భుత పరిష్కారం, తేనెతో లాభాలివే

Honey Benefits: వేసవితో పోలిస్తే వర్షకాలం, శీతాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలం సమస్యగా మారుతుంటుంది. కారణం శీతాకాలంలో ఇమ్యూనిటీ చాలా వరకూ తగ్గిపోవడమే. అందుకే దగ్గు, కఫం, గొంతు నొప్పి వంటి సమస్యలు తప్పకుండా వేధిస్తుంటాయి. 

మరి ఈ సమస్యలకు పరిష్కారం ఎలాగనేది ఇప్పుడు తెలుసుకుందాం. శీతాకాలంలో ఎదురయ్యే చాలా సమస్యలకు ప్రకృతిలో పుష్కలంగా లభించే తేనెతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. తేనెను చర్మ సంరక్షణ కోసమే కాకుండా దగ్గు, కఫం వంటి సమస్యలకు ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. తేనె క్రమం తప్పకుండా తీసుకుంటే ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది. ఇందులో ఉండే ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు, మాంగనీస్, కాపర్, ఫాస్పరస్, ఫోలేట్ పోషకాలు మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

దగ్గు, కఫం సమస్యలకు తేనె దివ్యౌషధంగా పనిచేస్తుందంటారు ఆయుర్వేద వైద్య నిపుణులు. సీజన్ మారినప్పుడు పిల్లల్నించి పెద్దల వరకూ దగ్గు, జలుబు కారణంగా ఛాతీలో కఫం పేరుకుపోతుంటుంది. గొంతు బొంగురుపోవడం వంటి సమస్య అధికమౌతుంది. దీనికి ప్రధాన కారణం శ్వాసకోశలో వచ్చే ఇన్‌ఫెక్షన్. శీతాకాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. 

నిజానికి తేనెను అద్భుతమైన ఆయుర్వేద ఔషధ ఖజానాగా పిలుస్తారు. దగ్గు, కఫం సమస్యలను అద్భుతంగా నిర్మూలించడమే కాకుండా మధుమేహం వ్యాధిగ్రస్థులకు కూడా మంచిదంటారు. వైద్యుని సలహా మేరకు పంచదార స్థానంలో తగిన తేనెను సేవిస్తే అంత హాని కలగదు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో మెటబాలిక్ సిండ్రోమ్, టైప్ 2 డయాబెటిస్ తగ్గించవచ్చు. గాయాల్ని నయం చేయడంలో తేనె చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా కాలిన గాయాలు నయం చేసేందుకు తేనె ఉపయోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందుకు ఉపయోగపడతాయి.

ఇటీవలి కాలంలో ప్రధానంగా కన్పిస్తున్న గుండెపోటు సమస్యలకు కూడా తేనె సరైన పరిష్కారమంటున్నారు వైద్యులు. తేనెను డైట్‌లో చేర్చుకోవడం వల్ల రక్తపోటు , రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా బరువు తగ్గించడంలో తేనె అద్భుతంగా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం పరగడుపున గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో తేనె కలుపుకుని సేవిస్తుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. లేదా రోజూ ఉదయం వేళ తేనె, నిమ్మరసం కలుపుకుని కూడా తాగవచ్చు.

Also read: Diabetes Diet: రోజూ పరగడుపున గుప్పెడు గింజలు తింటే చాలు, మధుమేహం దూరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News