Control Diabetes in 5 Weeks with these Foods: దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆహారపు అలవాట్లే బ్లడ్ షుగర్ సమస్యకు ప్రధాన కారణం. ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి ఆహారం తినకూడదనే విషయంపై అవగాహన ఉండాలి. డయాబెటిస్ నియంత్రణకు డైట్లో ఏయే ఆహార పదార్ధాలుండాలో తెలుసుకుందాం..
డయాబెటిస్ అనేది ఇటీవలి కాలంలో చాపకిందనీరులా విస్తరిస్తోంది. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడంతో డయాబెటిస్ సమస్య అధికమైంది. అధిక కేలరీలు, హై గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పదార్ధాలు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నప్పుడు ఏదైనా పదార్ధం తినాలంటే..ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. డయాబెటిస్ నియంత్రించాలంటే..పెద్దగా ఆందోళన అవసరం లేదు. ప్రతిరోజూ డైట్లో కొన్ని ఆరోగ్యకరమైన పదార్ధాలు చేర్చి..డయాబెటిస్ నియంత్రించవచ్చు.
కాకరకాయ
కాకరకాయ చేదుగా ఉన్నా..ఆరోగ్యానికి చాలా మంచిది. కాకరకాయ తినేందుకు ఎంత చేదుగా ఉంటే ఆరోగ్యపరంగా అంత మేలు కల్గిస్తుంది. కాకరకాయలో ఉండే పీ ఇన్సులిన్ అనే పదార్ధం డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. కాకరకాయ కూర కూడా డయాబెటిస్ రోగులకు చాలా మంచిది.
రాగులు
రాగుల్లో ఫైబర్, కాల్షియం, ఎమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రాగుల గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. డయాబెటిస్ రోగులు రాగులతో చేసన ఇడ్లీ, దోశ లేదా పరాఠా బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. గోధుమల్లో ఉండే హై కార్బోహైడ్రేట్స్ కారణంగా షుగర్ లెవెల్ పెరగవచ్చు. రాగులు బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గించడంలో సహాయపడతాయి.
బక్వీట్
డయాబెటిస్ రోగులకు ఆనపకాయ లాభదాయకం. డయాబెటిస్ రోగులు ఆనపకాయ తినడం చాలా మంచిది. ఆనపకాయలో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
ముల్లంగి
ముల్లంగి డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనకరం. ముల్లంగి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇందులో ఉండే పోషకాలు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. డయాబెటిస్ రోగులు ప్రతిరోజూ ముల్లంగి కూర, ముల్లంగితో పరాఠా వంటివి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
Also read: Winter Health Tips: చలికాలంలో గుండె ముప్పు ఎక్కువే, ఈ 5 పదార్ధాలతో గుండెకు రక్షణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook