Greeny Vegetables Benefits: ఆకుపచ్చ కూరగాయలతో.. కేన్సర్ ఇతర వ్యాధుల్నించి సంరక్షణ, స్థూలకాయానికి చెక్

Greeny Vegetables Benefits: ప్రతిరోజూ విటమిన్లు, ప్రోటీన్లతో నిండిన కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో రక్తశాతం పెరుగుతుంది. వివిధ రకాల రోగాల్ని దూరం చేయడమే కాకుండా..బరువు కూడా తగ్గించుకోవచ్చు..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 28, 2022, 05:20 PM IST
Greeny Vegetables Benefits: ఆకుపచ్చ కూరగాయలతో.. కేన్సర్ ఇతర వ్యాధుల్నించి సంరక్షణ, స్థూలకాయానికి చెక్

Greeny Vegetables Benefits: ప్రతిరోజూ విటమిన్లు, ప్రోటీన్లతో నిండిన కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో రక్తశాతం పెరుగుతుంది. వివిధ రకాల రోగాల్ని దూరం చేయడమే కాకుండా..బరువు కూడా తగ్గించుకోవచ్చు..

మనం తినే ఆహారం ఎప్పుడూ ఆరోగ్యకరమైందిగా ఉండాలి. మెరుగైన ఆరోగ్యం కోసం ఆకుపచ్చని కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వీటివల్ల శరీరంలో రక్తశాతం పెరగడమే కాకుండా..స్థూలకాయం తగ్గించేందుకు, దంతాల కేన్సర్, ఎనీమియాకు సరైన పరిష్కారం. కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరం ఇమ్యూనిటీ బాగుంటుంది. దాంతోపాటు చర్మం, కళ్లకు మంచిది.

ఆకుపచ్చ కూరగాయలు కాస్త చేదుగా ఉంటాయి. మెంతికూర, కాకరకాయ, బెండకాయ కూరల్లో కాల్షియం మోతాదుఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలకు మంచిదగి. దంతాలు, ఎముకలు ఎప్పుడూ పటిష్టంగా ఉండాలంటే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఉడికించిన పాలకూర తినడం వల్ల దంత సమస్య, నోటి దుర్గంధం తొలగిపోతాయి.

బరువు తగ్గించేందుకు ఎక్కువగా జిమ్, ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు. శరీరం బరువుని బట్టి డైట్‌ఛార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మంచి పద్ధతి. దీనివల్ల రోజుకో టార్గెట్ నిర్దేశించుకుని కేలరీలు తగ్గించుకోవచ్చు. ఫలితంగా బరువు వేగంగా తగ్గుతుంది. ప్రత్యేకించి స్థూలకాయం నుంచి విముక్తి పొందవచ్చు. 

కేన్సర్ బాధితుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది. లంగ్ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్, మౌత్ కేన్సర్, బ్లడ్ కేన్సర్‌లు రెట్టింపు వేగంతో వ్యాపిస్తున్నాయి. ఈ వ్యాధుల్నించి రక్షించుకునేందుకు డైట్‌లో ఎప్పుడూ ఫైబర్, కాల్షియం, మినరల్స్, ఐరన్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. 

Also read: White Rice: వైట్ రైస్‌తో బరువు తగవచ్చని మీకు తెలుసా, తీసుకునే విధానమిదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News