Here is Fantastic Health Benefits Of Anjeer: అంజీర్ పండ్లు.. వీటిని అత్తి పండ్లు అని కూడా అంటారు. మార్కెట్‌లో ఇవి విరివిగా లభిస్థాయి. సాధారణ పండ్లతో పాటు ఎండు ఫలాలుగానూ ఇవి అందుబాటులో ఉంటాయి. అంజీర్ పండ్లు చాలా రుచిగా ఉండడమే కాదు.. అద్భుతమైన పోషకాలు వీటి సొంతం. అంజీర్ పండ్లలో విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన అనేక పోషక మూలకాలు ఇందులో ఉన్నాయి. ఈ పోషకాలు మనిషి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్‌లను కలిగి ఉన్న ఈ పండ్లు.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
రక్తపోటు:
అత్తి పండ్లలో పొటాషియం, సోడియం, ఫాస్పొరిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ పండ్లు తింటే ఆరోగ్యమే కాకుండా అందంగా మారతారు. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర పండ్లను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో అంజీర పండ్లను తినడం వల్ల రక్తపోటు సమస్యలు రావు. రక్తపోటును ఇది అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రక్తపోటును నియంత్రిస్తాయి. అలాగే గుండెకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
జీర్ణక్రియ:
అత్తి పండ్లను తీసుకోవడం వల్ల పొట్టకు చాలా మేలు జరుగుతుంది. ఇందులో భారీ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సరిగా ఉండడానికి బాగా పనిచేస్తుంది. అసిడిటీ, అజీర్ణం, గ్యాస్ మొదలైన సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ప్రతి రోజు 2-3 అంజీర్ పండ్లను తేనెతో కలిపి తీసుకుంటే కడుపు ఖాళీ అవుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా దరి చేరవు.
శరీరానికి శక్తి:
ఖాళీ కడుపుతో అంజీర పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. ఈ పండులో అనేక రకాల పోషక మూలకాలు ఉంటాయి. ముఖ్యంగా శరీరంలో శక్తిని అందించే కార్బోహైడ్రేట్లు. అత్తి పండ్లతో పాలు తీసుకోవడం మంచి శక్తి వనరు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం ద్వారా రోజంతా శక్తివంతంగా ఉంటారు.
మొటిమలు మాయం:
మొటిమలతో ఇబ్బందులు పడుతున్న యువత అంజీర్ పండ్లతో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అంజీర్ పండ్లను మెత్తగా నూరి ఆ పేస్ట్‌ను మొటిమలకు అప్లై చేయాలి. ఆకులు కూడా వాడవచ్చు. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మొటిమలు మాయం అవుతాయి.
ఎముకలకు ఎంతో మేలు:
అంజీర్ పండ్లలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఈ పండ్లు తింటే ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. నిత్యం అంజీర్ పండ్లు తింటే ఎముకలు ధృడంగా ఉంటాయి. ఎముకల బలహీనత సమస్య ఉన్నవారు రోజు 2-3 పండ్లను తింటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. శరీరంలో ఉన్న మలినాలను తొలగించడంలో అంజీర్ పండ్లు సమర్థవంతంగా పనిచేస్తాయి.
సంతాన భాగ్యం:
లైంగిక సమస్యలు, సంతాన భాగ్యం కలగని వారికి అంజీర్ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. మగవారికి స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు, వయాగ్రాలా పని చేసేందుకు ఇవి దోహదపడతాయి. మగవాళ్లు 2 లేదా 3 అంజీర్లను రాత్రి పాలలో నానబెట్టి.. ఉదయం తింటే ఎంతో మంచిది.
Also Read: Henry Nicholls Out: దేవుడా.. ఇలా కూడా ఔట్ అవుతారా! వీడియో చూస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేరు
Also Read: TNPL Mankading: ఔట్ అయిన అసహనంలో.. మిడిల్ ఫింగర్ చూపించిన భారత బ్యాటర్! మండిపడుతున్న ఫ్యాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.