Fig: ప్రతిరోజూ 3 ఇవి తింటే ఏమవుతుంది తెలిస్తే ఇప్పటి నుంచి రోజూ తింటారు..

Fig Shocking Health benefits: అంజీర్ పండ్లు పోషకాలకు పవర్ హౌస్. ఇందులో ఫైబర్, జింక్, ఫోలేట్, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది. అంజీర్ పండ్లను డైట్ లో చేర్చుకోవడం వల్ల పుష్కల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే వీటిని నానబెట్టి ప్రతిరోజు ఒకటి తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు అవేంటో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Jan 23, 2025, 07:43 AM IST
Fig: ప్రతిరోజూ 3 ఇవి తింటే ఏమవుతుంది తెలిస్తే ఇప్పటి నుంచి రోజూ తింటారు..

Fig Shocking Health benefits: అంజీర్ పండ్లు రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవాలి. పరగడుపున తీసుకోవడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అంజీర్ పండ్లు ఇలా నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ రక్తంలో తగ్గిస్తుంది. నానబెట్టి అంజీర్ పండ్లు తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ సమస్య కూడా తగ్గిస్తుంది.. దీంతో కార్డియా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అర్టెరీ బ్లాకేజీ వంటి సమస్యలు కూడా రావు.

అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ రోగులకు మంచిది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల అంజీర్‌ పండ్లు మేలు చేస్తాయి. నానబెట్టి తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మెరుగు మేలు చేస్తుంది. ఇది మలబద్దక సమస్యకు ఎఫెక్టీవ్‌ రెమిడీ. అంతేకాదు ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. అంజీర్‌ పండ్లు షుగర్‌ ఉన్నవారు తినడం వల్ల వారికి స్వీట్‌ తినాలన్న కోరిక కూడా తీరుతుంది. అయితే, ఏదైనా మితంగా తినాలి. 

ఇదీ చదవండి: ఈ 5 ఫుడ్స్ తింటే మీ జుట్టు ఆగకుండా పెరుగుతూనే ఉంటుంది.. ఏ షాంపూ కూడా అవసరం ఉండదు..

అంజీర్ పండ్లు తరచూ తీసుకోవడం వల్ల ఎముక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉంటుంది. ఆరోగ్యకరమైన ఎముకలకు తోడ్పడుతుంది. ఇది ఆస్టియోపోరోసిస్ ప్రమాదం నుంచి తగ్గిస్తుంది. దీంతో ఎముకలు బలంగా మారుతాయి. అంజీర్ పండ్లు తినడం వల్ల ఇందులోనే యాంటీ ఆక్సిడెంట్లు అంటే విటమిన్ సి, ఫ్లెవనాయిడ్స్‌, ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. సీజనల్ జబ్బులకు వ్యతిరేకంగా పోరాడుతాయి. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. అంజీర్‌ పండ్లు డ్రై రూపంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. వీటిని రాత్రి పాలు లేదా నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల పుష్కల ప్రయోజనాలు. రోజూ కనీసం రెండు అంజీర్‌ పండ్లను అయినా తినడానికి ప్రయత్నించండి.

ఇదీ చదవండి:  ఎయిర్‌టెల్‌ యూజర్లకు పెద్దదెబ్బ.. ఎక్కువ మంది రీఛార్జ్ చేసుకునే ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ డేటా తొలగింపు..

వెయిట్ లాస్ జర్నీలో ఉన్నావాళ్లు అంజీర్ పండ్లను తీసుకోవాలి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంజీర్ పండ్లను స్నాక్ రూపంలో కూడా తీసుకోవచ్చు. కడుపున నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది.. తద్వారా బరువు పెరగకుండా ఉంటారు. అంజీర్‌ పండ్లు తినడం వల్ల శరీరారోగ్యం మాత్రమే కాదు చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో విటమిన్స్, మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. నొప్పి, వాపు సమస్య రాకుండా ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది.అంజీర్ పండ్లను డైట్ లో చేర్చుకోవడం వల్ల నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇది ట్రిప్టఫన్‌ నేచురల్‌గా ఉత్పత్తి చేస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News