Food Causes Cancer: క్యాన్సర్ ముప్పును పెంచే ఈ అలవాట్లను ఇవే!

Food That Causes Cancer: ప్రపంచ మొత్తానికి వేధించే అంటువ్యాధి క్యాన్సర్‌. ఈ క్యాన్సర్‌ సమస్య అనేది ఎక్కువగా భారతదేశంలో కనిపిస్తుంది. ఈ వ్యాధి బారిన పిల్లలు, పెద్దలు అధికంగా గురైతున్నారు. అసులు ఈ క్యాన్సర్‌ సమస్య ఎలా వస్తుంది?   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2024, 05:38 PM IST
Food Causes Cancer: క్యాన్సర్ ముప్పును పెంచే ఈ అలవాట్లను ఇవే!

Food That Causes Cancer: ఈ మధ్యకాలంలో చాలా మంది క్యాన్సర్‌ సమస్య బారిన పడుతున్నారు. దీని వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఈ క్యాన్సర్ సమస్య రావడానికి గల ముఖ్య కారణం మారిన మన ఆహార అలవాట్లని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  కొన్ని ఆహారపదార్థాలు , అలవాట్ల  మార్పుల వల్ల ఈ సమస్య మరింత వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. ఈ పదార్థాలలో కొన్నింటిని అదుపు చేయకుండా వదిలేస్తే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

ఈ  అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల మనం క్యాన్సర్‌ బారి పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. 

ఆహారపు అలవాట్లు:

ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.   ఈ ప్రాసెస్‌ ఫుడ్స్‌కి బదులు కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి.

అధిక మద్యం:

అధికంగా ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల బ్రెస్ట్ , లివర్ క్యాన్సర్ వంటి వ్యధుల బారిన పడాల్సి ఉంటుంది. ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించడం  వల్ల ఈ సమస్యల బారిన పడకుండా ఉంటాము. 

స్మోకింగ్:

స్మోకింగ్ చేయడం వల్ల కూడా క్యాన్సర్‌ బారిన పడాల్సి ఉంటుంది. దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మీరు క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండాలి అంటే వెంటనే ధూమపానం మానేయడం చాలా మంచిదని చెబుతున్నారు.

ఆరోగ్య పట్ల నిర్లక్ష్యం:

మీకు క్యాన్సర్ ఉంటే ముందుగానే  చికిత్స తీసుకోవడం చాలా మంచిది. నిర్లక్ష్యం చేయడం వల్ల శరీరం మొత్తం సోకుతుంది. రెగ్యులర్ హెల్త్ చెకప్‌లను నిర్లక్ష్యం చేస్తే సమస్యలు పెరుగుతాయి.  

UVకు దూరంగా:

సూర్యరశ్మికి గురికావడం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు టానింగ్‌ కూడా జరుగుతుంది. దీని కోసం  మీరు సన్‌స్క్రీన్‌ ఉపయోగించడం చాలా మంచిది.

నిశ్చల జీవనశైలి:

రెగ్యులర్ వ్యాయామం క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల క్యాన్సర్‌ను బయటపడవచ్చు. రెగ్యులర్‌గా వ్యాయామం చేయకుండా , ఆనారోగ్యకరమైన పదార్థాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ బారిన పడాల్సి ఉంటుంది.
 

Also Read Weight Loss: వాల్‌నట్స్‌తో కూడా బరువు, BPని తగ్గించుకోవచ్చు..ఇలా చేయండి రోజు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News