Dry Skin vs Kidney Disease: చర్మం పొడిబారుతోందా..లైట్‌గా తీసుకోవద్దు..ఆ వ్యాధి కావచ్చు

Dry Skin vs Kidney Disease: మీకు చర్మం తరచూ పొడిబారుతుంటుందా..శీతాకాలంలో సాధారణమే అని లైట్‌గా తీసుకోవద్దు. కొన్ని సీరియస్ వ్యాధుల లక్షణం కూడా అది. అందుకే జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 20, 2022, 08:35 AM IST
  • చర్మం తరచూ పొడిబారడం, దురదగా ఉంటోందా
  • లైట్‌గా తీసుకోవద్దంటున్న వైద్య నిపుణులు
  • కిడ్నీ వ్యాధికి సంకేతాలు ఇవే అంటున్న అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ
Dry Skin vs Kidney Disease: చర్మం పొడిబారుతోందా..లైట్‌గా తీసుకోవద్దు..ఆ వ్యాధి కావచ్చు

Dry Skin vs Kidney Disease: మీకు చర్మం తరచూ పొడిబారుతుంటుందా..శీతాకాలంలో సాధారణమే అని లైట్‌గా తీసుకోవద్దు. కొన్ని సీరియస్ వ్యాధుల లక్షణం కూడా అది. అందుకే జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు చూద్దాం.

చలికాలంలో చర్మం పొడిబారుతుంటూ ఉంటుంది. ఉష్ణోగ్రతలో తేడా, నీరు తక్కువగా తాగడం వల్ల ఇలా జరుగుతుంటుంది. అయితే ఎప్పుడూ ఇలానే ఉంటుందని అనుకోవద్దంటున్నారు వైద్య నిపుణులు. కేవలం చలికాలంలోనే కాకుండా మిగిలిన సీజన్లలో కూడా కొంతమందికి ఈ సమస్య ఎదురవుతుంటుంది. క్రీమ్స్, లోషన్స్ వాడుతూ ఆ సమస్య నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందుతుంటారు. అయితే చర్మం పొడి బారడమనేది కొన్ని రకాల వ్యాధులకు లక్షణాలంటున్నారు వైద్య నిపుణులు. అందుకే సరైన పరీక్షలు చేయించుకుంటే మంచిదంటున్నారు.

చర్మం తరచూ పొడిబారడమనేది సాధారణ లక్షణమే అయినా అప్రమత్తంగా ఉండాల్సిన విషయాన్ని సూచిస్తుంది. కిడ్నీ సమస్య ఉంటే చర్మం తరచూ పొడిబారుతుంటుంది. రక్తాన్ని ఫిల్టర్ చేసి..కాల్షియం, పొటాషియం పోషకాల సమతుల్యతను నియంత్రించడం కిడ్నీలు చేసే పని. శరీరంలోని ఇతర భాగాలు పనిచేయడం, హార్మోన్స్ విడుదలలో కూడా కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. కిడ్నీల్లో సమస్య ఉంటే..వివిధ రకాల రుగ్మతలు తలెత్తుతాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం..కిడ్నీ సమస్య ఉంటే..చర్మ సంబంధిత లక్షణాలు వస్తాయి. చర్మం దురదగా ఉండటం, తేమ కోల్పోవడం, పొలుసులుగా ఉండటం ప్రధానంగా కన్పిస్తుందట. ఫిష్ స్కేల్ స్కిన్ ఏర్పడుతుందని అమెరికన్ డెర్మటాలజీ చెబుతోంది. అందుకే ఇటువంటి ఏ లక్షణాలు కన్పించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. 

ఎందుకంటే కిడ్నీలో సమస్య వచ్చినప్పుడు లేదా సరిగ్గా పనిచేయనప్పుడు ఆ ప్రభావం లేదా లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. చర్మం పొడి బారడం, దురద ఉండవచ్చు లేదా వీపు భాగంలో, చేతుల్లో దురద ఉండవచ్చు. ఒక్కొక్కరికీ ఒక్కోలా లక్షణాలుంటాయి. కాబట్టి దురద ఉన్నప్పుడు..లైట్‌గా తీసుకోవద్దంటున్నారు వైద్య నిపుణులు. అప్రమత్తమైతే కిడ్నీ వ్యాధుల్ని ముందుగానే పసిగట్టి..చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చు. కిడ్నీ వ్యాధి అనేది నిర్లక్ష్యం చేస్తేనే ప్రాణాంతకమవుతుంది. 

Also read: Best Health, Fitness Apps: ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కి పనికొచ్చే బెస్ట్ యాప్స్ ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News