Drumstick Leaves For Diabetes: మునగలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా వివిధ రకాల వ్యాధులకు కూడా చెప్పి పెడుతుంది. చాలామంది డ్రమ్ స్టిక్స్ ని తినేందుకు ఇష్టపడరు.. కానీ వాటి ద్వారా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మునగా ఓ గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. మునగ కాయల్ని కాకుండా ఆకులను కూడా తీసుకుంటే శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ ఆకుల్లో ప్రోటీన్స్, విటమిన్ బి 6, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి మూలకాలు వాటిల్లో ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.
అంతేకాకుండా మునగ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు విచ్చలవిడిగా లభిస్తాయి. కాబట్టి ఈ ఆకులను మధుమేహం ఉన్నవారు తీసుకుంటే ఆ వ్యాధి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ ఆకులను తీసుకోవడం వల్ల సులభంగా రోగాలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మునగ ఆకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
సులభంగా బరువు తగ్గడం:
బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండా మునిగా ఆకులను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఇందులో అధిక పరిమాణంలో క్లోరోజెనిక్ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి ఇవి ఒబిసిటీని నియంత్రించడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఈ మునగ ఆకులను వినియోగించాలి.
మధుమేహం సమస్యలు:
మధుమేహం అనేది ప్రస్తుతం భారత్ లో తీవ్రవ్యాధిగా మారిపోయింది. ప్రతి ఇంట్లో ఒకరు ఈ మధుమేహం బారిన పడుతున్నారు. అయితే మధుమేహం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మునగ చెట్టు యొక్క బెరడు, ఆకులను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో యాంటీ డయాబెటిస్ లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వీటిని వినియోగిస్తే సులభంగా మధుమేహం నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గుండె సమస్యలు:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది గుండె సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండె పోటుకు గురవుతున్నారు. అయితే ఈ సమస్య ఇప్పుడు సాధారణ సమస్యగా మారిపోయింది. ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మునగ ఆకులను వినియోగించాల్సి ఉంటుంది. ఇలా వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా వినియోగించడం వల్ల సులభంగా గుండె సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
Also Read: Bathukamma 2022: బతుకమ్మ పండుగను పూర్వికులు ఇలా జరుపుకునే వారట.. మరి మీరు ఎలా జరుపుకుంటున్నారు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి