Onion Oil For Hair Benefits: ఉల్లిపాయ నూనెతో జుట్టుకు జీవకళ.. తయారీ విధానం తెలుసా?

Onion Oil For Hair Growth: ప్రస్తుతం కాలంలో చాలా మంది జుట్టు బలహీనత, జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకునే ఓ చిట్కా గురించి తప్పక తెలుసుకోవాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2024, 06:48 PM IST
Onion Oil For Hair Benefits: ఉల్లిపాయ నూనెతో జుట్టుకు జీవకళ.. తయారీ విధానం తెలుసా?

Onion Oil For Hair Growth: ఉల్లిపాయల్లో ఉండే అనేక పోషకాలు జుట్టు సంరక్షణకు సహకరిస్తాయి. అయితే ఈ ఉల్లిపాయల ద్వారా మీ ఇంట్లో మీరే నూనెను తయారు చేసుకోవచ్చు. దాన్ని జుట్టుకు పూసుకోవడం వల్ల కురులు ధృఢంగా, ఆకర్షణీయంగా మారతాయి. అదేంటో ఇప్పుడే తెలుసుకుందాం. సాధారణంగా ఉల్లిపాయల్ని కూరల్లో లేదా విరివిగా తింటుంటాం. అయితే దీన్ని పలు రకాలైన సౌందర్య లేపనాల్లో కూడా వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా జుట్టు పెరుగుదల, షాంపూలు, ఉల్లిపాయ నూనెలు మార్కెట్లో లభిస్తాయి. అయితే ఉల్లిపాయల నూనె జట్టుకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఉల్లిపాయలోని సహజ కణజాలాలలో విటమిన్లు - ఏ, సి, ఈ లతో
పాటు బి-కాంప్లెక్స్ విటమిన్లైన సల్భర్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి ప్రయోజనకరమైనవి ఉన్నాయి. ఇవి జుట్టుకు పోషణ అందించే కెరాటిన్, ప్రోటీన్ వంటి పోషకాల ఉత్పత్తికి శ్రేయస్కరం. ఉల్లిపాయల నూనెలో క్వేర్సేటిన్ అనే శక్తివంతమైన ప్లేవనాయిడ్ ఉంటుంది. ఇవి శరీరంలోని ఇతర ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి జుట్టును బలంగా మారుస్తాయి. ఉల్లిపాయ నూనెతో జుట్టు పెరుగుదల మెరుగవ్వడమే కాకుండా జుట్టు రాలడం, చుండ్రు సమస్యలతో సహా ఇతర ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలతో పాటు వివిధ చర్మ సమస్యలను సహజ నివారిణిగా పరిగణిస్తున్నారు. 

అయితే ఉల్లిపాయ నూనె కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ వంటింట్లో ఉంటే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. అయితే ఉల్లిపాయ నూనె ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ముందుగా ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలు చేసి.. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ లేదా ఏమైన పాత్ర పెట్టి కొద్ది మంటపై కొబ్బరినూనెను వేడి చేయాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా కలపాలి. అలా తక్కువ మంటపై ఉల్లిపాయ ముక్కలు రంగు మారేంత వరకు వేడి చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి.. నూనెను చల్లబరిచి గాజు సీసాలో వడగట్టుకొని నిల్వ చేసుకోవాలి. అలా కొన్నివారాల పాటు ఫ్రిజ్‌లో ఉంచి వాడుకోవచ్చు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News