Cholesterol Control Tips: ప్రస్తుతం చాలా మంది కొవ్వు కారణంగా వివిధ రకాల సమస్యలను ఎదురుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా గుండెపోటు వంటి సమస్యలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలా మందిలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడంతో గుండెపోటు సమస్యల స్థాయి మరింత పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు శ్రద్ధ వహించి కొవ్వు స్థాయిని తగ్గించేందుకు వ్యాయామం చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం చాలామంది కొవ్వు పెరిగి గుండెపోటు కారణంతో చనిపోతున్నారిని వైద్యులు చెబుతున్నారు. మరుతున్న పరిస్థితులకు అనుగుణంగా చెడు జీవనశైలి కారణంగా చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే కొవ్వు పెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందంటున్నారు. కాబట్టి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన ఐదు విషయాలు ఏమిటో తెలుసుకుందాం..
1. బరువును అదుపులో ఉంచుకోవడం:
అన్నింటిలో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు మీ బరువును అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే దాని పెరుగుదలతో కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది. దీని కోసం మీరు మీ ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే వాటిని తినకపోవడం మంచిది.
2. మంచి కొలెస్ట్రాల్ కోసం వ్యాయామం:
మీ శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవడాని వ్యాయామం చేయాడం చాలా ముఖ్యం. అందువల్ల మీరు ప్రతిరోజూ ఒకటి లేదా రెండు గంటల పాటు వ్యాయామాన్ని తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నించండి.
3. ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండండి:
ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అసలైన, ప్రాసెస్ చేసిన ఆహారంలో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను పెంచడమో కాకుండా అనారోగ్యానికి దారి తీస్తుంది.
4. ధూమపానం, మద్యం సేవించవద్దు:
ధూమపానం, మద్యపానం రెండూ శరీరానికి మంచివి కాదు. దీంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడమే కాకుండా.. అనేక వ్యాధులకు కారణమతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా అలవాట్లను మానుకోవడం మంచిదని చెబుతున్నారు.
5. అతిగా తీపి తినకూడదు:
మీరు అవసరమైన దానికంటే ఎక్కువ స్వీటు తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలోపరిమిత పరిమాణంలో చక్కెరను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Kcr Fire on Talasani : ఈటెల తరువాత మరో నేత మీద కేసీఅర్ అగ్రహం... వేటు తప్పదా...
Also Read: Brutal Murder: హైదరాబాద్ శివారులో దారుణం.. భార్యను, యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసిన భర్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook