Leaves For Diabetes: మధుమేహం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామందిలో రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం, గుండెపోటు సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందే మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా వారు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వీరు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటేనే శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉండి రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారు ఈ కింద సూచించిన ఆహారాలను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
కరివేపాకు:
రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించేందుకు కరివేపాకులు ప్రభావంతంగా పనిచేస్తాయని ఆరోగ్య నిబంధనలు చెబుతున్నారు. కాబట్టి డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఆహారంలో తప్పకుండా కరివేపాకులను వినియోగించాల్సి ఉంటుంది.
మెంతి ఆకులు:
చాలామంది మెంతి ఆకులను పరాఠాలల్లో తినేందుకు ఇష్టపడతారు. ఇందులో ఉండే గుణాలు సులభంగా నియంత్రించేందుకు సహాయ పడతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఈ ఆకులను క్రమం తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది.
మామిడి ఆకులు:
మామిడి ఆకులు కూడా శరీరానికి చాలా మంచిది. ఈ ఆకులను టీలా తయారు చేసుకుని ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగితే శరీరానికి ఫైబర్ విటమిన్ సి పుష్కలంగా అంది రక్తంలోని చక్కర పరిమాణాలు నియంత్రణలో ఉంటారు.
వేప ఆకులు:
వేపాకులను తెలంగాణలోని పల్లె ప్రాంతాల్లో ఈ యాంటీ బయోటెక్ గా వినియోగిస్తారు వీటిని ఎక్కువగా చర్మ ఇతర అనారోగ్య సమస్యలకు వాడుతుంటారు. ఈ ఆకులను పొడిచేసి ఆ పొడిని ప్రతిరోజు నీటిలో కలుపుకుని తాగితే రక్తంలోని చక్కర పరిమాణాలు సులభంగా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా మధుమేహం శాశ్వతంగా దూరమవుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Rohit Sharma: రోహిత్ భయ్యా.. నీకు కుట్లు పడిన విషయం గుర్తుందా! నువ్ 'మగధీర'లో హీరో
Also Read: Delhi MCD Election Result: ఢిల్లీ కార్పొరేషన్ పీఠం ఆప్ కైవసం.. బీజేపీ చేసిన తప్పులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి