Diabetes Control In 4 Days: రక్తంలో చక్కెర పెరడం, తగ్గడం అనేది తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో ఉన్న గ్లూకోజ్ పై ఆధారపడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది ప్రీడయాబెటిస్ బారిన పడుతున్నారు. అనారోగ్యమైన ఆహారం తీసుకోవడం, వివిధ రకాల ఆహారపు అలవాట్ల వల్ల ఇలాంటి సమస్యల బారిన పడుతునట్లు నిపుణులు తెలుపుతున్నారు. ప్రీడయాబెటిస్‌తో బాధపడుతున్న వారు తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు. వీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇంటి చిట్కాలను వినియోగించడం వల్ల కూడా ప్రీడయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి చిట్కాలను పాటిస్తే రక్తంలో చెక్కర పరిమాణం నియంత్రణలో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరంలో ప్రీడయాబెటిస్ ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి:
>>తరచుగా మూత్ర విసర్జన
>>అలసట
>>దాహం పెరిగింది
>>మసక దృష్టి
>>తలనొప్పి
ఆహారంలో వీటిని చేర్చుకోవాలి:
పప్పు దినుసులు:
పప్పు దినుసులలో డైటరీ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందని పోషకాహార నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇందులో రాఫినోస్ అనే పిలువబడే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రిస్తుంది.
యాపిల్స్:
ప్రతిరోజూ ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ ఫీజు ఆదా అవుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇందులో ఉండే మూలకాలు శరీరానికి దృఢంగా చేసేందుకు కృషి చేస్తాయి. అయితే రాఫినోస్ అనే పిలువబడే కరిగే ఫైబర్ యాపిల్స్‌లో ఉంటుంది. ఇది డయాబెటిస్ ప్రభావవంగా పని చేస్తుంది.
ఓట్స్:
ఓట్స్‌లో కరిగే ఫైబర్, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. కావున ఇవి శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా ప్రభావవంతంగా పని చేస్తాయి.
బార్లీ:
గోధుమల్లోదాదాపు 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్‌ని తగ్గించడానికి పనిచేస్తుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించేందుకు కృషి చేస్తాయి.
Read Also: Keerthy Suresh: పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమైన కీర్తి.. వరుడు ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook