COVID-19 vaccine తీసుకునే ముందు, తర్వాత ఎలాంటి Foods తినాలి ? ఏవి తినొద్దు ?

Foods to take and foods to avoid before and after COVID-19 vaccine: కరోనావైరస్‌కి విరుగుడుగా వ్యాక్సిన్ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ? ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఏం తింటే వ్యాక్సిన్ ప్రభావం తగ్గుతుందో, ఏం తింటే వ్యాక్సిన్ ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తుందోననే సందేహం చాలామందిలో ఉంది. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నమే ఈ కథనం. 

Last Updated : Apr 12, 2021, 08:27 PM IST
  • కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకునే ముందు, ఆ తర్వాత చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా ?
  • కొవిడ్-19 వ్యాక్సిన్‌కి ముందు ఆ తర్వాత తీసుకోవాల్సిన ఆహారం ఏంటి ? తీసుకోకూడని ఆహారం ఏంటి ?
  • వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎక్కువగా కనిపిస్తున్న లక్షణాలు ఏంటి ? అందుకు కారణాలు ఏంటి అనే వివరాలం కోసం ఈ కథనం చదవండి..
COVID-19 vaccine తీసుకునే ముందు, తర్వాత ఎలాంటి Foods తినాలి ? ఏవి తినొద్దు ?

Foods to take and foods to avoid before and after COVID-19 vaccine: కరోనావైరస్‌కి విరుగుడుగా వ్యాక్సిన్ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ? ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఏం తింటే వ్యాక్సిన్ ప్రభావం తగ్గుతుందో, ఏం తింటే వ్యాక్సిన్ ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తుందోననే సందేహం చాలామందిలో ఉంది. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నమే ఈ కథనం. 

ఇప్పటికే కొన్ని మిలియన్ల మంది జనాభా COVID-19 తీసుకోగా ఇంకా ఎంతో మంది కరోనా వ్యాక్సిన్ కోసం క్యూలో వేచిచూస్తున్నారు. అయితే, కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వాళ్లంతా వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేయడం కోసం ఆహారంగా ఏం తీసుకుంటే బాగుంటుంది ? వేటికి దూరంగా ఉంటే బాగుంటుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 

Drink water | నీరు ఎక్కువగా తీసుకోండి:
కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత వీలైనంత ఎక్కువగా నీరు తాగండి. అప్పుడు మీ శరీరం డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండి నీరసం దనిచేరనివ్వదు. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. అందుకే నీరు తాగడం మర్చిపోవద్దు.

Also read : Surgical face mask vs 5-layered mask: సర్జికల్ మాస్క్ vs N95 మాస్క్.. కరోనా నుంచి సేఫ్టీ కోసం ఏది బెటర్ ?

Don’t drink alcohol | అల్కహాల్ తీసుకోవద్దు:
అల్కాహాల్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అన్నింకిమించి మద్యం అలవాటు అనేది వ్యాధినిరోధక శక్తి నశించేలా చేస్తుంది. శరీరం డీహైడ్రేట్ అయినా లేదా వ్యాధినిరోధక శక్తిని కోల్పోయినా అది కొవిడ్-19 టీకా పనితీరుపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా జ్వరం, ఒళ్లునొప్పులు, కళ్లు తిరగడం, నీరసం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ( Side effects of COVID-19 vaccine) వచ్చే ప్రమాదం ఉంటుంది.

Whole grain foods | ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కాకుండా హోల్ గ్రెయిన్ ఫుడ్స్:
కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవాలంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెల్దీ బాడీ కోసం హెల్దీ ఫుడ్ (Healthy foods) తప్పనిసరి. అందుకే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు అంతకంటే ముందు ఆ తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా హోల్ గ్రెయిన్ ఫుడ్స్ తీసుకోవాలి. ప్రాసెసింగ్ చేసిన వాటిలో కొవ్వు, కెలొరీలు అధికంగా ఉండనుండగా హోల్ గ్రెయిన్ ఫుడ్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది.

Also read : New Coronavirus Symptoms: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే, కనిపిస్తే టెస్టులు తప్పనిసరి

Fibre-rich foods | ఫైబర్ ఫుడ్స్‌కి అధిక ప్రాధాన్యత:
వ్యాధి నిరోధక శక్తి పెరగడం కోసం శరీరానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అవసరం. క్లినికల్ స్లీప్ మెడిసిన్ అనే జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం కొవ్వు, షుగర్ అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి నిద్రలేమికి కూడా దారితీస్తుంది. అదే కానీ జరిగితే అది మీరు తీసుకునే కొవిడ్-19 వ్యాక్సిన్ పనితీరు కూడా నెమ్మదిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Balanced diet | బ్యాలెన్స్‌డ్ డైట్ 
కొవిడ్-19 వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన చాలా మందిలో కలిగిన కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అవి బలహీనత, కళ్లు తిరగడం వంటి లక్షణాలే. అలా కాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, తీసుకున్న తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఫైబర్ అధికంగా ఉండే పళ్లు, కూరగాయలు (Fruits and vegetables) ఎక్కువగా తీసుకోవడం మంచిది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News