Coriander Juice Benefits: కొత్తిమీర ఆహారాల రుచిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు ఆహారాల రుచిని పెంచడమే కాకుండా శరీరానికి ఆరోగ్యాన్ని అందించేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్లు A, C, K, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి కొత్తిమీరను ప్రతి రోజు జ్యూస్‌లా తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ జ్యూస్‌ని తాగడం వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొత్తిమీర జ్యూస్‌లో విటమిన్-సి, బీటా-కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా సులభంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జీర్ణక్రియ సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి:
మధుమేహంతో బాధపడేవారిలో రోజు రోజుకు చక్కెర పరిమాణాలు పెరుగుతూ ఉంటాయి. దీని కారణంగా మధుమేహం తీవ్రతరమవుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు కొత్తిమీరతో తయారు చేసిన జ్యూస్‌ని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
పీరియడ్స్‌లో ఉన్నవారు:
కొత్తిమీర రసంలో ఉండే గుణాలు పీరియడ్స్‌లో ఉన్నవారికి ఔషధంలా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు తిమ్మిర్లు, వాపులు, నొప్పి వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:
అధ్యయనాల ప్రకారం..కొత్తిమీర రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో లభించే పొటషియం గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఒత్తిడిని నియంత్రిస్తుంది:
తీవ్ర ఒత్తిడి సమస్యలతో బాధపడేవారు కూడా కొత్తిమీర రసాన్ని తాగొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు నిద్రలేమి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
ఎముకలను దృఢంగా చేస్తుంది:
కొత్తిమీర రసంలో కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఈ రసాన్ని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. అంతేకాకుండా బోలు ఎముకల వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
కళ్లకు మేలు చేస్తుంది:
కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ కంటికి మేలు చేసేందుకు కూడా సహాయపడుతుంది. తరచుగా కంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి