Cholesterol Tips: మీ డైట్‌లో ఈ ఆహార పదార్ధాలుంటే కొలెస్ట్రాల్ 30 రోజుల్లో మాయం

Cholesterol Tips: మనిషి శరీరంలో నిత్యం ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. జీవన విధానంలో ప్రతి క్రియ సక్రమంగా ఉన్నంతవరకూ ఆరోగ్యం బాగుంటుంది. ఏ సమస్యా తలెత్తదు. ఒకసారి సమస్య ఏర్పడిందంటే అంతర్గతంగా ఏదో రుగ్మత ఉన్నట్టే.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 9, 2023, 08:35 PM IST
Cholesterol Tips: మీ డైట్‌లో ఈ ఆహార పదార్ధాలుంటే కొలెస్ట్రాల్ 30 రోజుల్లో మాయం

Cholesterol Tips: మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపించే అంశాలు చాలా ఉంటాయి. ఇవి మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, నిద్రపై ఆధారపడి ఉంటాయి. చెడు ఆహారపు అలవాట్లతో కొలెస్ట్రాల్, డయాబెటిస్, అధిక రక్తపోటు సమస్యలు ఏర్పడతాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగలవు కూడా. అందుకే ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉంటే ఏ సమస్యా ఉండదు.

చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా ఎదురయ్యే వ్యాధుల్లో ప్రధానమైంది కొలెస్ట్రాల్. ఈ ఒక్క సమస్య ఇతర సమస్యలకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ అనేది ప్రధానంగా మనం తినే ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ కొలెస్ట్రాల్ కారకాలే. చెడు ఆహారపు అలవాట్ల వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఇది అధిక రక్తపోటుకు, మధుమేహానికి దారి తీస్తుంది. అధిక రక్తపోటు కారణంగా గుండె వ్యాధుల సమస్య తలెత్తవచ్చు. ఇక మధుమేహం అనేది కిడ్నీలపై ఆధారపడి ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగల వ్యాధి ఇది. అందుకే జాగ్రత్త చాలా చాలా అవసరం. 

శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్ కాగా రెండవది మంచి కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీనినే ఎల్‌డీఎల్ అని కూడా పిలుస్తారు. ఈ క్రమంలో కొలెస్ట్రాల్ దారి తీసే ఆహార పదార్ధాలను డైట్ నుంచి దూరంగా ఉంచాలి. కొలెస్ట్రాల్ కరిగించే ఆహార పదార్ధాలను డైట్‌లో భాగంగా చేసుకోవాలి. ఎందుకంటే కొలెస్ట్రాల్ దూరమైతే గుండె పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. డైట్‌లో ప్రతిరోజూ ఈ పదార్ధాలు ఉండేట్టు చూసుకుంటే కొలెస్ట్రాల్ సమస్య దరి చేరదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

రోజూ తీసుకునే ఆహారంలో లేదా వారానికి కనీసం 2-3 సార్లు సోయా బీన్స్ ఉండేట్టు చూసుకోవాలి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ దూరం చేయడంలో సోయా బీన్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి శాచ్యురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఫలితంగా కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

ఇక రెండవది బీన్స్. పోషక పదార్ధాలు ఎక్కువగా ఉండి.. ఆకలి త్వరగా వేయకుండా ఉంటుంది. ఇందులో హై ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా వెజిటబుల్ ఆయిల్స్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వెజిటబుల్ ఆయిల్స్‌లో ఉండే విటమిన్ ఇ, కేలు కొవ్వును నియంత్రిస్తాయి. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ అధికంగా ఉండే చేపల్ని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుంది.

ఆకుపచ్చని కూరగాయలు అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ఉండే ఫైబర్ శరీరానికి చాలా శక్తిని ఇవ్వడమే కాకుండా చెడు కొవ్వును కరిగిస్తుంది. వంకాయ, బెండకాయలు మంచి ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి. ఇక నట్స్ రోజూ తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్ తగ్గించుకోవచ్చు. వీటిలో ఉండే ప్రోటీన్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వీటన్నింటికి తోడు తృణధాన్యాలు. తృణధాన్యాల్లో అధికంగా ఉండే ఫైబర్ ఆకలిని తగ్గించడమే కాకుండా కొవ్వును కరిగిస్తాయి.

Also read: Memory Tips: చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నారా, జ్ఞాపకశక్తిని పెంచే 5 అద్భుత పదార్ధాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News