Calcium Rich Foods: వెన్ను నొప్పి , కీళ్ల నొప్పి సమస్యలకు ఈ డ్రై ఫ్రూట్స్‌తో చెక్‌ పెట్టవచ్చు..!

Dry Fruits Rich In Calcium: మనలో చాలా మంది కీళ్ల నొప్పి, వెన్నునొప్పి ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. దీని కోసం మందులు, చికిత్సలు చేసుకుంటారు. అయితే కొన్ని రకాల పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2024, 05:23 PM IST
Calcium Rich Foods: వెన్ను నొప్పి , కీళ్ల నొప్పి సమస్యలకు ఈ డ్రై ఫ్రూట్స్‌తో చెక్‌ పెట్టవచ్చు..!

Dry Fruits Rich In Calcium: ప్రస్తుతకాలంలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా కీళ్ల నొప్పి, ఎముకలు బలహీనత, మణికట్టు నొప్పి, వెన్ను నొప్పి వంటి ఇతర సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యల గల కారణం శరీరంలో కాల్షియం తక్కువగా ఉండటం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మీరు తీసుకొనే ఆహారంలో కాల్షియం తక్కువగా ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు కలుగుతాయి.  అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలి అంటే మీరు తప్పకుండా కాల్షియం కలిగిన ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. 

అయితే కాల్షియం అనగానే పాలు మనకు గుర్తుకు వస్తుంది. కానీ పాలు  మాత్రమే కాకుండా కొన్ని డ్రై ఫ్రూట్స్‌, నట్స్‌లతో కూడా మనం ఎముకలను దృఢంగా తయారు చేసుకోవచ్చు.  అయితే ఎలాంటి నట్స్‌ను ఆహారంలో భాగంగా తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. 

క్యాల్షియం పుష్కలంగా లభించే కొన్ని డ్రై ఫ్రూట్స్ :

డ్రై ఫ్రూట్స్‌లో బాదం కూడా ఒకటి.  ఒక బాదం గింజలో 76mg క్యాల్షియం ఉంటుంది. అంతేకాకుండా మెగ్నీషియం, ఫాస్పరస్‌, విటమిన్ కె కూడా లభిస్తుంది. ఇవి ఎముకలను ఎంతో మేలు చేస్తాయి. దీంతో పాటు జీడిపప్పు తీసుకోవడం చాలా మంచిది. ఇందులో 53mg క్యాల్షియం ఉంటుంది. వీటితో పాటు  జింక్, ఐరన్, విటమిన్‌ బి-6 కూడా పొందవచ్చు.  అలాగే తేనెను తీసుకోవడం వల్ల ఎలాంటి ఎముకుల సమస్య బారిన పడాల్సిన అవసరం లేదు. తేనెలో కూడా 83mg క్యాల్షియం ఉంటుంది. వీటితో పాటు మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం కి కూడా పొందవచ్చు. 

ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో 50mg క్యాల్షియం ఉంటుంది.  అంతేకాకుండా ఫైబర్‌, పొటాషియం, విటమిన్ ఎ కూడా లభిస్తుంది. ఇవి ఎముకలను దృఢంగా తయారు చేయడంలో కూడా సహాయపడుతుంది. ఖర్జూరంలో సుమారు 56mg క్యాల్షియం ఉంటుంది. ఇందులో క్యాల్షియంతో పాటు  ఫైబర్, పొటాషియం, ఐరన్ కి కూడా కీళ్ల సమస్యలకు సహాయపడుతుంది. 

వీటిని మీరు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు పండ్లు , కూరగాయలను కూడా తీసుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా మీరు పాలు, పెరుగు, జున్ను వంటి పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. మీకు డయాబెటిస్, గుండె సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించి ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకోండి. 

ఆకుకూరలు తీసుకోవడం వల్ల కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. అందులో కాలే, బ్రోకలీ, ముల్లంగి తప్పకుండా తీసుకోవాలి. పాలు అలాగే పాలతో తయారు చేసే టోఫు, చీజ్‌ వంటి ఇతర పదార్థాలలో కూడా క్యాల్షియం లభిస్తుంది. గింజలను కూడా తీసుకోవడం వల్ల క్యాల్షియం దొరుకుతుంది. ముఖ్యంగా శనగపప్పు, బ్లాక్‌ బీన్స్‌, లెంటిల్స్ వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు చేపలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అందులోను సార్డిన్స్, సాల్మన్‌ వంటి పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. మీరు పైన చెప్పిన పదార్థాలను తీసుకోవడం వల్ల క్యాల్షియం పుష్కలంగా దొరుకుతాయి. 
Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News