Anjeer Sweet: మధుమేహం వ్యాధిగ్రస్థులు సైతం ఆనందంగా తినగలిగే అంజీర్ పాయసం, ఎలా చేయాలంటే

Anjeer Sweet: కొత్త ఏడాది వచ్చేసింది. అందరూ కేక్స్, స్వీట్స్ ఒకరికొకరు తిన్పిస్తుంటారు. మరి మధుమేహం వ్యాధిగ్రస్థుల పరిస్థితి ఏంటనేది అందర్నీ వేధించే ప్రశ్న. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 31, 2022, 11:44 PM IST
Anjeer Sweet: మధుమేహం వ్యాధిగ్రస్థులు సైతం ఆనందంగా తినగలిగే అంజీర్ పాయసం, ఎలా చేయాలంటే

మధుమేహం వ్యాధిగ్రస్థులు సైతం కొత్త యేడాదిలో ఆనందంగా తినగలిగే స్వీట్స్ ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉందా. నిజమే అదే అంజీర్ పాయసం. అంజీర్‌లో నేచురల్ స్వీట్ ఉంటుంది. ఇది మధుమేహం వ్యాధిగ్రస్థులకు సైతం లాభదాయకం.

అంజీర్ డ్రై ఫ్రూట్‌లో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంజీర్ తినడం వల్ల కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దాంతోపాటు బరువు కూడా తగ్గించుకోవచ్చు. మరోవైపు ఆస్తమా రోగులకు అంజీర్ నిజంగానే ఓ అద్భుతమైన ఆయుర్వేద ఔషధం. అంజీర్ పాయసం రుచిలో బాగుంటుంది. ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. అంజీర్‌లో నేచురల్ స్వీట్ ఉంటుంది. ఫలితంగా డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరం. శరీరంలో రక్త హీనత ఉన్నా అంజీర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

అంజీర్ పాయసం ఎలా చేయాలి

దీనికోసం 1 లీటర్ పాలు, 10-15 అంజీర్ పండ్లు, 2 టేబుల్ స్పూన్ల్ బాదం, 5-6 ఖర్జూరం, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 8-10 నానబెట్టిన బాదం, 8-10 నానబెట్టిన పిస్తా, పావు కప్ కేసర్, 1 కప్పు కండెన్స్‌డ్ పాలు, 4-5 ఇలాచీ, 2 టీ స్పూన్ల బాదం కతరన్, 2 టీ స్పన్ల నెయ్యి అవసరమౌతాయి.

ముందుగా అంజీర్‌ను శుభ్రం చేసి ముక్కలుగా కోసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో టీ స్పన్ల నెయ్యి వేసి వేడి చేయాలి ఇందులో అంజీరా ముక్కలు వేసి స్లో ఫ్లేమ్ పై ఫ్రై చేయాలి. తరువాత పెద్ద గిన్నెలో పాలు తీసుకుని అందులో ఈ అంజీర్ వేయాలి. ఆ తరువాత 4-5 గంటలు అలాగే ఉంచాలి. తరువాత గిన్నెలో మిగిలిన నెయ్యిలో ఒలిచిన బాదం వేయాలి. ఆ తరువాత స్లో ఫ్లేమ్‌లో 1-2 నిమిషాలు ఫ్రై చేయాలి. మిక్సీలో బాదం, ఇలాచీ వేసి మిక్స్ చేయాలి. తరువాత ఇందులో పాలలో నానబెట్టిన అంజీర్ వేయాలి. ఆ తరువాత వీటన్నింటినీ ఒకేసారి మిక్సీ చేయాలి. మిశ్రమంగా చేసుకుని ప్లేట్‌లో తీసుకోవాలి. నెయ్యిలో మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేయాలి. ఆ తరువాత మిగిలిన పాలను బాగా ఉడికించాలి. ఆ తరువాత ఈ పాలలో అంజీర్ మిశ్రమాన్ని కలపాలి. ఇందులో కండెన్స్‌డ్ మిల్క్ వేసి స్లో ఫ్లేమ్‌లో 4-5 నిమిషాలు వండాలి. 

ఇందులో కేసర్ వేసి బాగా కలపాలి. ఆ తరువాత మరోసారి 3-4 నిమిషాలు వండాలి. అంతే మీకిష్టమైన రుచికరమైన అంజీర్ పాయసం సిద్ధం. ఇందులో పిస్తా, బాదం ముక్కలతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.

Also read: Health Tips: మలబద్ధకం, అజీర్తి సమస్యలకు అద్భుతమైన చిట్కాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News