Migraine headache: మైగ్రేన్ తలనొప్పి తో బాధపడుతున్నారా? 7 ప్రభావవంతమైన చిట్కాలు..

Home Remedies for Migraine headache:  మైగ్రేన్ తలనొప్పి తో బాధపడుతున్న వారు పెప్పర్ మెంట్ ఆయిల్ నుదుటిపై అప్లై చేయాలి. దీని సువాసన నయం చేసే గుణాలు కలిగి ఉంటుంది. అంతేకాదు ఇందులో చల్లదనం ఇచ్చే గుణాలు కలిగి ఉంటాయి. దీంతో మైగ్రేన్ తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది. 

Written by - Renuka Godugu | Last Updated : Aug 9, 2024, 06:52 AM IST
Migraine headache: మైగ్రేన్ తలనొప్పి తో బాధపడుతున్నారా? 7 ప్రభావవంతమైన చిట్కాలు..

Home Remedies for Migraine headache: విపరీతమైన స్ట్రెస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల తలనొప్పి వస్తుంది. కొంతమంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతుంటారు. దీంతో తలనొప్పి మరీ ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొన్ని రకాల ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం.

 అల్లం టీ..
 మైగ్రేన్ తలనొప్పి తో బాధపడుతున్న వారికి అల్లం టీ ఎఫెక్టీవ్‌ రెమిడీ. అల్లం టీ తీసుకోవడం వల్ల తలనొప్పి సమస్య వెంటనే తగ్గిపోతుంది. అల్లం టీ రూపంలో తీసుకోవాలి. ఎందుకంటే అల్లంలో మంట సమస్యను తగ్గించే గుణం కలిగి ఉంటుంది. ఇది మైగ్రేన్స్ లక్షణాలతో బాధపడుతున్నవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండటం వల్ల ఎఫెక్టివ్ రెమెడిగా పనిచేస్తుంది. మైగ్రేన్ తలనొప్పిని వెంటనే తగ్గించే గుణం అల్లం కలిగి ఉంటుంది.

పెప్పర్మింట్ ఆయిల్..
మైగ్రేన్ తలనొప్పి తో బాధపడుతున్న వారు పెప్పర్ మెంట్ ఆయిల్ నుదుటిపై అప్లై చేయాలి. దీని సువాసన నయం చేసే గుణాలు కలిగి ఉంటుంది. అంతేకాదు ఇందులో చల్లదనం ఇచ్చే గుణాలు కలిగి ఉంటాయి. దీంతో మైగ్రేన్ తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది. 

లావెండర్ ఆయిల్..
మైగ్రేన్ తలనొప్పికి మరో ఎఫెక్టివ్ రెమిడి లావెండర్ ఆయిల్. లావెండర్ ఆయిల్ సువాసనను పీల్చుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది. ఉపశమనం కలిగిస్తుంది. త్వరగా లావెండర్‌ ఆయిల్ తలనొప్పితో బాధపడుతున్నవారికి ఎఫెక్టీవ్‌ రెమిడీ.

 హైడ్రేషన్..
తలనొప్పితో బాధపడుతున్న వారు నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల డిహైడ్రేషన్ నుంచి బయటపడతారు. మైగ్రేన్ తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది.

ఆ క్యూ ప్రెషర్..
ఆక్యు ప్రెజర్ టెక్నిక్ ఉపయోగించిన  కూడా మైగ్రేన్‌ తలనొప్పిని తగ్గిపోతుంది. టెన్షన్ వల్ల వచ్చే మైగ్రేన్ తలనొప్పికి ఎఫెక్ట్ రెమిడీ.

ఇదీ చదవండి:  ఈ గింజ మీ ఇంట్లో ఉంటే చాలు ఆరోగ్యం మీ చెంతే.. ఇలా మీ డైట్ లో చేర్చుకోండి..

మెడిటేషన్..
 మెడిటేషన్ వల్ల కూడా మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది ఇది స్ట్రెస్ ని తగ్గిస్తుంది త్వరగా ఉపశమనం పొందుతారు. ప్రతి రోజూ మెడిటేషన్‌ చేయడం వల్ల కూడా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

 విటమిన్ బి12..
మైగ్రెయిన్ తలనొప్పితో బాధపడుతున్న వారు విటమిన్ బి 12 సప్లిమెంట్ తీసుకున్న రేటు పెరిగి తలనొప్పి నుంచి బయటపడతారు. విటమిన్ బీ 12 ఉండే ఆహారాలు కూడా ఉంటాయి. ఇది తీవ్రంగా వచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది.

 మంచి నిద్ర
 మంచి నిద్ర అవసరం మైగ్రేన్ తల నొప్పితో బాధపడుతున్న వారికి ఇది కూడా మంచి రెమిడీ నిద్ర బాగా సరి పోతే తలనొప్పి సమస్య ఉండదు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

ఇదీ చదవండిపెరుగులో జీలకర్ర వేసి తింటే మీ శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News