Ayurvedic Remedy for Sore Throat: చలి కాలంలోని చాలా మందిలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. వీటి కారణంగా తరచుగా గొంతు సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే టాన్సిల్స్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. చాలా మందిలో గొంతు నొప్పి కారణంగా దగ్గు విపరీతంగా పెరిగిపోతోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రసాయనాలతో కూడిన మందులకు బదులుగా కొన్ని ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. దీని వినియోగించడం వల్ల సులభంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
గొంతు నొప్పితో బాధపడేవారు ప్రతి రోజు ఉసిరి రసంతో తయారు చేసిన కషాయాన్ని తాగడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. ఇవే కాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. దీని కారణంగా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగుతుంది:
గొంతు నొప్పితో బాధపడుతున్నవారు ఆయుర్వేద నిపుణులు సూచించి ఈ రెమెడీని వినియోగిస్తే సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ముందుగా 300 మి.లీ నీటిలో ఒక టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ఉప్పు కలపండి. ఈ నీటిని 6 నిమిషాల పాటు ఉడకబెట్టండి. ఇలా ఉడికిన నీటిని హాయిగా తాకేంత వరకు చల్లారనివ్వాలి. ఈ నీటితో రోజుకు మూడు నాలుగు సార్లు పుక్కిలించండి. ఇలా ప్రతి రోజు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
ఈ రెమెడీస్‌తో కూడా చెక్ పెట్టొచ్చు!:
15-20 మి.లీ ఉసిరి రసాన్ని ఒక చెంచాలో తీసుకుని అందులోనే తేనెను కలిపి ప్రతి రోజు రెండు సార్లు తాగాలి.
లైకోరైస్ పౌడర్‌ను తేనెతో కలిపి రోజుకు ఒకసారి గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.
ఒక చెంచా మెంతులను 250 మి.లీ నీటిలో మరిగించి తీసుకుంటే కూడా సులభంగా గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
4-5 తులసి ఆకులను నీటిలో ఉడికించి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.
గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసం తేనె కలుపుకుని తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter